Power Crisis : భూపాలపల్లి పై కేంద్ర ప్రభుత్వం కన్ను

తెలంగాణలోని భూపాలపల్లి   ధర్మల్ విద్యుత్ కేంద్రంపై  కేంద్రం  కన్నేసింది.  ఇక్కడకు బొగ్గు సరఫరా ఆపి ఇతర రాష్ట్రాలకు బొగ్గు సరఫరా చేయాలని ఆదేశించింది.

Power Crisis : భూపాలపల్లి పై కేంద్ర ప్రభుత్వం కన్ను

Bhupalapallly Thermal Power Plant

Power Crisis : తెలంగాణలోని భూపాలపల్లి   ధర్మల్ విద్యుత్ కేంద్రంపై  కేంద్రం  కన్నేసింది.  ఇక్కడకు బొగ్గు సరఫరా ఆపి ఇతర రాష్ట్రాలకు బొగ్గు సరఫరా చేయాలని ఆదేశించింది.  దేశవ్యాప్తంగా ధర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గు నిల్వలు తగ్గి విద్యుత్ సంక్షో భానికి దారితీసే పరిస్ధితుల నేపధ్యంలో కేంద్ర విద్యుత్, బొగ్గు శాఖలు బొగ్గు నిల్వలపై సమీక్ష నిర్వహిస్తున్నాయి.

అందులో భాగంగా తెలంగాణ బీహార్, ఝూర్ఖండ్ తదితర రాష్ట్రాలలో బొగ్గు గనులున్న ప్రాంతాల్లోని ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉన్న బొగ్గు నిల్వలపై ఆరా తీసింది.  దేశంలోని మొత్తం 116 ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజు ఎంత బొగ్గు సరఫరా చేస్తున్నారు… ఎంత  నిల్వలున్నాయో విచారించింది. మొత్తం విద్యుత్ కేంద్రాల్లో 4 చోట్ల మాత్రమే 13 రోజుల పాటు కరెంటు ఉత్పత్తి అవసరానికి మించి బొగ్గు నిల్వలున్నట్లు తేలింది. వాటిలో భూపాలపల్లి విద్యుత్ కేంద్రంలో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నట్లు తెలుసుకుంది.

అధిక నిల్వలున్నప్పటికీ రోజు ఎందుకు బొగ్గు పంపిస్తున్నారని ప్రశ్నించింది.  బొగ్గు కొరత ఉన్న కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర విద్యుత్ కేంద్రాల్లో తీవ్ర కొరత ఉన్నందున అక్కడికి సరఫరా చేయాలని ఆదేశించింది. వాస్తవానికి భూపాల పల్లి విద్యుత్ కేంద్రం  బొగ్గు కోసం తాడిచర్ల బొగ్గు గనిని కేంద్రం నుంచి తీసుకుంది. ఇక్కడ తవ్విన బొగ్గును భూపాల పల్లికే   వినియోగించాలని షరతు విధిస్తూ కేంద్రం అనుమతిచ్చింది.

తాడిచర్ల గనిలో కూడా జెన్ కో తరుఫున సింగరేణి సంస్ధే బొగ్గు తవ్వి భూపాల పల్లికి పంపుతోంది. ఇక్కడ రోజకు 5 వేల టన్నుల బొగ్గే   వస్తుండంటంతో అదనంగా  మరో 8 వేల టన్నుల బొగ్గు ఇతర గనుల నుంచి వస్తోంది. ఇవన్నీ కలిసి 15 రోజుల వరకు భూపాలపల్లిలో  నిల్వలు 15 రోజులకు సరి పోతాయి.

దీంతో ఇక్కడకు వచ్చే బొగ్గును ఇతర రాష్ట్రాలకు పంపాలని కేంద్రం మౌఖిక ఆదేశాలిచ్చింది. కానీ ఇందుకు సంబంధించి లిఖిత పూర్వక ఆదేశాలివ్వలేదని అధికారులు తెలిపారు.  సొంతంగా మంచిర్యాల జిల్లా జైపూర్ లో విద్యుత్ కేంద్రం నిర్నించుకున్న సింగరేణి పైనా కేంద్ర పరీశీలనజరుపుతోంది.