Kishan Reddy : జర్నలిస్టులకు మరింత స్వేచ్ఛ ఉండాలి, దేశ గౌరవాన్ని పెంచే వార్తలివ్వాలి-కిషన్ రెడ్డి

జర్నలిస్టులకు మరింత స్వేచ్ఛ ఉండాలని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సమాజానికి మేలు చేసే, దేశం గౌరవాన్ని పెంచే వార్తలను ఇవ్వాలి.(Kishan Reddy)

Kishan Reddy : జర్నలిస్టులకు మరింత స్వేచ్ఛ ఉండాలి, దేశ గౌరవాన్ని పెంచే వార్తలివ్వాలి-కిషన్ రెడ్డి

Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జర్నలిస్ట్ డైరీ-2023 (ఢిల్లీ టీయూడబ్ల్యూజే-హెచ్ 143) ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు, కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు.

జర్నలిస్టులకు మరింత స్వేచ్ఛ ఉండాలని అన్నారు. మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ కాదు రియల్ ఎస్టేట్ అని కేకే అన్నారు. జర్నలిస్టులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర మరవలేనిది అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.

దేశం గౌరవాన్ని పెంచే వార్తలివ్వాలి-కిషన్ రెడ్డి
మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ గురజాడ హాల్ లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ -హెచ్143 (టీయూడబ్ల్యూజే) అధ్యక్షులు నాగిళ్ల వెంకటేశ్ అధ్యక్షతన డైరీ -2023 ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జర్నలిస్ట్ డైరీ-2023 ని నేతలు ఆవిష్కరించారు. జర్నలిస్టులకు మరింత స్వేచ్ఛ ఉండాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే, జర్నలిస్టుల స్వేచ్చ అంటే, యాజమాన్యాల స్వేచ్ఛ కాద స్పష్టం చేశారు.(Kishan Reddy)

Also Read..Central Minister Kishan Reddy: భయంకరమైన నిజాలు అంటూ.. కేసీఆర్ పాలనపై ఆసక్తికర ట్వీట్ చేసిన కిషన్ రెడ్డి

ఢిల్లీ జర్నలిస్టులు ఐకమత్యంతో ఏకతాటిపై ఉండడం సంతోషదాయకమన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీ మీడియా.. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల గొంతుకను సమాంతరంగా వినిపిస్తుందని కొనియాడారు. వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపాలని సూచించారు. సమాజానికి మేలు చేసే, దేశం గౌరవాన్ని పెంచే వార్తలను ఇవ్వాలని కోరారు.(Kishan Reddy)

ప్రజాస్వామ్య పరిరక్షణ లో మీడియా పాత్ర కీలకం:
జర్నలిస్టులకు స్వేచ్ఛ ఉండాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని, కరోనా సమయంలో జర్నలిస్టులు కష్టపడి పనిచేశారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టుల కృషి అభినందనీయమని అన్నారు. మూడు ‘పీ’ లు… పోలీస్, పొలిటీషియన్, ప్రెస్ రిపోర్టర్లు సమాజం కోసం అలుపులేకుండా పని చేస్తున్నారని చెప్పారు. సమాజంలో ప్రజాస్వామ్య పరిరక్షణ లో మీడియా పాత్ర కీలకమన్నారు.

మీడియా.. ఫోర్త్ ఎస్టేట్ కాదు రియల్ ఎస్టేట్-కేకే
సత్యాన్ని శోధించాల్సిన గురుతర బాధ్యత జర్నలిస్టులదేనని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అభిప్రాయపడ్డారు. ఏ విషయమైనా నిర్ధారణ చేసుకున్న తర్వాతే వార్త రూపంలోకి తేవాలని సూచించారు. మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ మాత్రమే కాదని, అది రియల్(నిజమైన) ఎస్టేట్ అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు.

జర్నలిస్టులకు అండగా ఉంటాం-వైసీపీ ఎంపీ బీద
జర్నలిస్టులు ఒక డైరీని తీసుకురావడం అంటే… గర్వించదగ్గ విషయమన్నారు. ఢిల్లీ జర్నలిస్ట్ డైరీకి రూపకల్పన చేయడం అభినందనీయమని వైఎస్సార్ సీపీ ఎంపీ బీద మస్తాన్ రావు అన్నారు. పోటీ ప్రపంచంలో తప్పుడు వార్తలకు చెక్ పెట్టేలా.. మరింత జాగ్రత్తతో జర్నలిస్ట్ వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ సీఎం జగన్ తరపున జర్నలిస్టులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Also Read..Srinivas Goud: లక్షల కోట్లు దోచుకున్న వారిని వదిలేసి ఆడబిడ్డను వేధిస్తున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర మరవలేనిదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధిలోనూ ఢిల్లీ జర్నలిస్ట్ ల కృషి అవసరమన్నారు. ఈ దిశలో కేంద్రాన్ని, తెలంగాణ ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేసేలా వ్యవహరించాలని కోరారు.(Kishan Reddy)

జర్నలిస్టులకు రూ.10లక్షల ఉచిత ఆరోగ్య బీమా, ఇళ్ల స్థలాలు..
జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా తమ యూనియన్ పని చేస్తోందని టీయూడబ్ల్యూజే ఢిల్లీ అధ్యక్షుడు నాగిళ్ల వెంకటేశ్ అన్నారు. యూనియన్ లోని ప్రతి జర్నలిస్ట్ లకు రూ. 10లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తున్నట్లు చెప్పారు. నిత్యం సమాజ శ్రేయస్సు కోసం పని చేస్తోన్న జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు.