Medaram : మేడారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వన దేవతలను ఏం కోరుకున్నారంటే

పండుగను గిరిజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకుంటారని తెలిపారు. కరోనా మహమ్మారి మీద విజయం సాధించి సుఖసంతోషాలతో ఉండే విధంగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. గిరిజన విశ్వవిద్యాలయానికి..

Medaram : మేడారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వన దేవతలను ఏం కోరుకున్నారంటే

Kishan Reddy

Central Minister Kishan Reddy Visit Medaram : మేడారం జాతరకు భక్తులు పోటెత్తున్నారు. సాధారణ భక్తులతో పాటు..వీవీఐపీలు, వీఐపీలు, ఇతర ప్రముఖులు కూడా విచ్చేసి సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగనుందనే సంగతి తెలిసిందే. 2022, ఫిబ్రవరి 18వ తేదీ శుక్రవారం మేడారానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచ్చేశారు. అనంతరం అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మేడారం జాతర కు జాతీయ హోదా ఉండదని ఎందుకంటే  పండుగలకు జాతీయ హోదా ఎక్కడా లేదని గుర్తు చేశారు. అయితే మేడారం జాతరకు విస్తృత ప్రచారం కల్పిస్తామని హామీనిచ్చారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి వైభవంగా జరిగే ఈ పండుగ ప్రకృతి పండుగ అన్నారు.

Read More : CM KCR : నేడు మేడారం జాతరకు వెళ్లనున్న సీఎం కేసీఆర్‌.. వనదేవతలకు ప్రత్యేక పూజలు

ఈ పండుగను గిరిజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకుంటారని తెలిపారు. కరోనా మహమ్మారి మీద విజయం సాధించి సుఖసంతోషాలతో ఉండే విధంగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్రం రూ. 45 కోట్ల నిధులు కేటాయించామని, త్వరలోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోందని తెలిపారు. ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగిందన్నారు. రామప్పకు, టూరిజం డిపార్ట్మెంట్ లకు పథకాల కింద అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు. పర్యాటక మంత్రి అయినా తరువాత రామప్ప యూనెస్కో గుర్తింపు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఏడుగురి మంత్రులు గిరిజనులున్నారని, గిరిజనుల అభ్యున్నతికీ ప్రధాన మంత్రి మోదీ ఎంతగానో కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Read More : Medaram Jatara 2022 : మేడారం జాతరలో 20 ఏళ్ల తర్వాత అద్భుత ఘట్టం

మరోవైపు…మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తుల జయజయధ్వానాల మధ్య సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరింది. 2022, ఫిబ్రవరి 17వ తేదీ గురువారం సాయంత్రం చిలుకలగుట్ట నుంచి భక్తుల కోలాహలం, భారీ బందోబస్తు మధ్య సమ్మక్క బయలుదేరింది. ఆమె బయలుదేరగానే చిలుకల గుట్ట దిగువన గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రాత్రి 9గంటల 45నిమిషాలకు గద్దెపై ఆశీనురాలైంది. సమ్మక్క తల్లి గద్దెల వద్దకు చేరుకోవడంతో కాసేపు దర్శనాలు నిలిపివేశారు. గిరిజన పూజారులు సంప్రదాయ పూజలు చేసిన తరువాత దర్శనాలు కొనసాగించారు. అమ్మ గద్దెపైకి చేరే అద్భుతాన్ని కనులారా వీక్షించిన భక్తకోటి పరవశించిపోయింది.