తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో మార్పులు, సంక్రాంతి తర్వాత..కాలేజీలు ఓపెన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో మార్పులు, సంక్రాంతి తర్వాత..కాలేజీలు ఓపెన్!

Changes in Telangana Inter exams : కరోనా నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ పరీక్షల విధానంలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశ్నాపత్రంలో ఛాయిస్ పెంచాలని, పరీక్ష సమయాన్ని తగ్గించాలని యోచిస్తోంది. ప్రశ్నా పత్రంలో 2, 4, 8 మార్కుల పశ్నల ఛాయిస్ పెంచాలని ప్రతిపాదలను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఇంటర్‌లో షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్‌లో ఛాయిస్ లేదు. మిగిలిన ప్రశ్నల్లో ఛాయిస్ ఉంది. ఈ ఏడాది 10 ప్రశ్నలు ఇస్తే అందులో ఐదింటికి మాత్రమే జవాబులు రాసేలా ఉండొచ్చని.. దీని వల్ల విద్యార్థులకు మరింత వెసులుబాటు కలుగుతుందని తెలుస్తోంది.

మరోవైపు..ఏప్రిల్ నెలాఖరులో పరీక్షలను ప్రారంభించాలని ఇంటర్ బోర్డు అధికారులు యోచిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించినందున మార్చి నెలాఖరు వరకు సిలబస్ పూర్తి అవుతుందని.. పరీక్షల నిర్వహణ తేదీలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని అధికారులు తెలిపారు. ఇక ఎంపీసీ, ఆర్ట్స్ గ్రూపులకు ఉదయం.. బైపీసీ, కామర్స్ గ్రూప్ విద్యార్థులకు మధ్యాహ్నం పరీక్షలు జరపాలని ఇంటర్ బోర్డు యోచిస్తోంది. సంక్రాంతి పండగ అనంతరం తెలంగాణలో జూనియర్‌ కాలేజీలు ఓపెన్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఇంటర్‌బోర్డ్‌ సెక్రటరీ జలీల్‌. ఇప్పటికే షిఫ్ట్‌లు వారీగా క్లాసులు నడిపించేందుకు ప్రభుత్వానికి ప్రాతిపాదనలు పంపామన్నారు.

ఇటు APPSCని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేశారు అధికారులు. ఇకపై ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ట్యాబ్స్‌ ద్వారానే పోటీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రశ్నాపత్రాలు లీక్‌ అవుతున్నందున ఆన్‌లైన్‌ పరీక్షలకు రంగం సిద్ధం చేస్తున్నారు. టెక్నాలజీ వినియోగంతోనే ఆన్సర్‌ షీట్ల కరెక్షన్‌ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.