ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించి..అమ్మాయిలా చాటింగ్, తర్వాత కోరిక తీర్చమంటాడు

ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించి..అమ్మాయిలా చాటింగ్, తర్వాత కోరిక తీర్చమంటాడు

Man blackmail : ఇన్ స్ట్రా గ్రామ్ లో అందమైన అమ్మాయి..ఫొటో..ప్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు.. అమ్మాయిల మాదిరిగా చాటింగ్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వా..సెక్స్ చాటింగ్ చేస్తాడు..అప్పటికే…డౌన్ లోడ్ చేసుకున్న యువతుల అర్ధనగ్న, నగ్న ఫొటోలు వారికి పంపించి..మీ ఫొటోలు కూడా పంపించాలని కోరుతాడు. కొందరు ఫొటోలు పంపించగానే..అప్పుడు అసలు కథ స్టార్ట్ చేస్తాడు. నా కోరికలు తీర్చాలంటూ…బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతాడు. ఇలా..ఒకరు, ఇద్దరు కాదు..ఏకంగా 70 మందికిపైగా బాధితులను వేధించాడు. చివరకు ఓ బాధితురాలి ఫిర్యాదుతో సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం…విజయవాడకు చెందిన సుమంత్..హైదరాబాద్ లోని మణికొండలో ఓ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. రాత్రి వేళ అమ్మాయి ఫొటోతో కూడిన నకిలీ ఇన్ స్ట్రా గ్రామ్ ద్వార..అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. అమ్మాయిల మాదిరిగా చాటింగ్ చేస్తాడు. చాలా మంది అమ్మాయిలే..కదా..అని ఫ్రీగా మాట్లాడుతారు. అనంతరం..మెల్లి..మెల్లిగా..సెక్స్ చాటింగ్ లోకి వెళ్తాడు. ఇంటర్‌నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన అమ్మాయిల అర్ధనగ్న ఫొటోలు, నగ్న ఫొటోలను వారికి పంపించి, అవతలి వారి ఫొటోలు కూడా పంపించాలని కోరుతాడు. కొందరు ఫొటోలు పంపిస్తారు. అప్పుడు అసలు కథ మొదలు పెడుతాడు. నేను ఫలాన చోట ఉంటాను.. నీ ఫొటోలు నా దగ్గర ఉన్నాయి… వాటిని బయటపెడితే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా.. నేను చెప్పినట్లు చేయాలంటూ.. తన కోరికలను వాళ్ల ముందు పెడతాడు.

బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతాడు. ఇలా.. 70 మందికిపైగా బాధితులు.. ఇతడి బ్లాక్‌మెయిలింగ్‌ వలలో చిక్కారు. బ్లాక్‌మెయిలింగ్‌ను తట్టుకోలేక ఓ బాధితురాలు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకుని ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలో ఎస్సై మహిపాల్‌ బృందం దర్యాప్తు చేపట్టింది. నిందితుడు ఎక్కడున్నారో గుర్తించారు. 2021, ఫిబ్రవరి 02వ తేదీ మంగళవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి సెల్ ఫోన్ పరిశీలించగా…మహిళల ఫొటోలు ఉన్నట్లు గుర్తించారు. అతడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.