టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు.. అందరూ పాస్, ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా కారణంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. పదో తరగతి సహా అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి

  • Published By: naveen ,Published On : May 14, 2020 / 03:33 AM IST
టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు.. అందరూ పాస్, ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా కారణంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. పదో తరగతి సహా అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి

కరోనా కారణంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. పదో తరగతి సహా అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 22వ తేదీ నుంచి స్కూళ్ల, కాలేజీలు మూసే ఉన్నాయి. కాగా జూలైలో పరీక్షల నిర్వహణకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు రెడీ అవుతున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వాలు తెలిపాయి. కాగా, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిగిలిపోయిన(పెండింగ్) టెన్త్, ఇంటర్(12వ తరగతి) పరీక్షలు నిర్వహించకూడదని ఛత్తీస్ గడ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు(CGBSE) నిర్ణయించింది. ఇందుకు బదులుగా ఆయా పేపర్లకు ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా మార్కులను కేటాయిస్తామని CGBSE సెక్రటరీ గోయల్ తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే 1 నుంచి 9 తరగతులు, 11వ తరగతి విద్యార్థులను పాస్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసింది.

కొత్త విద్యా సంవత్సరం దగ్గర పడుతోంది:
కరోనా కట్టడికి మార్చి చివరి వారంలో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా అప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. లాక్ డౌన్ కారణంగా 10, 12వ తరగతి పరీక్షలు నిలిచిపోయాయి. అప్పటికే కొన్ని పరీక్షలు నిర్వహించారు. మిగిలిన పరీక్షలు వాయిదా పడ్డాయి. లాక్ డౌన్ ముగిశాక మిగతా పరీక్షలు నిర్వహించాలని అనుకున్నా, ఆ తర్వాత లాక్ డౌన్ 2, లాక్ డౌన్ 3 అమల్లోకి వచ్చాయి. మే 17 తర్వాత కూడా లాక్ డౌన్ 4 ఉంటుందని ప్రధాని మోడీ సంకేతాలిచ్చారు. ఈ క్రమంలో కరోనా వైరస్ ఇప్పట్లో వదిలే అవకాశం లేదని, మరోవైపు వచ్చే విద్యా సంవత్సరం దగ్గర పడుతోందని, ఈ క్రమంలోనే మిగిలి ఉన్న 10, 12వ తరగతుల పరీక్షలను రద్దు చేసినట్లు ఛత్తీస్ గడ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు తెలిపింది. 

ఇంటర్నల్ అసెస్ మెంట్ కు హాజరుకాకపోయినా పాస్ చేయాలని ఆదేశం:
టెన్త్ క్లాస్ కి సంబంధించి మైనర్ సబ్జెక్టులు, 12వ తరగతికి సంబంధించి జాగ్రఫీ, కొన్ని ఆప్షనల్ సబ్జెక్టులకు నిర్వహించాల్సిన పరీక్షలు నిలిచిపోయాయి. వీటికి మే లో పరీక్షలు నిర్వహించాలని అనుకున్నారు. అయితే లాక్ డౌన్ పొడిగిస్తూ పోవడంతో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని అధికారులు తేల్చారు. కాగా, ఇంటర్నల్ అసెస్ మెంట్ కు హాజరుకాని విద్యార్థులకు బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. మినిమమ్ మార్కులతో వారందరిని పాస్ చేయాలని నిర్ణయించారు. మిగిలి ఉన్న సబ్జెక్టులకు రీఅసెస్ మెంట్ చేసే సమయంలో ఒక్క విద్యార్థిని కూడా ఫెయిల్ చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

Read Here>> ఇకపై కరోనా టెస్టు ఎంతో చౌక.. గంటకే రిజిల్ట్..!