క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం గా కోడికూర ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం గా కోడికూర ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

Chicken meals for TB patients in Telangana State : రాష్ట్రంలో క్షయ వ్యాధిగ్రస్తులకు  ప్రభుత్వం తొలిసారిగి  కోడికూరను  సప్లై చేస్తోంది.  క్షయ వ్యాధి గ్రస్తులు త్వరగా  కోలుకోవాలి అంటే వారికి అవసరమైన మందులతో పాటు పౌష్టికాహారం ఇవ్వాలని భావించి వారి మెనూలో కోడి కూరను చేర్చింది.

ఇప్పటిదాకా  వారికి రోజూ  ఇచ్చే మెనూలో ఉన్న రెండు కోడి గుడ్లతో పాటు వారానికి ఒకసారి (బుధవారం) కోడి కూరను ఇవ్వనున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ఖమ్మంలోని  జిల్లా ప్రధానాసుపత్రిలోని క్షయ విభాగంలో గత బుధవారం కోడికూర తో  ఆహరం ఇచ్చేకార్యక్రమం మొదలైంది. బుధవారం నాడు మాత్రం రెండు కోడిగుడ్లకు బదులు కోడి కూర ఇస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో టీబీ రహిత సమాజానికి కృషి చేస్తున్నామని జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్.వి. సుబ్బారావు తెలిపారు.  2019లో  3200 మంది వ్యాధిగ్రస్తులు ఉండగా…. వీరిలో 94 శాతం మంది వ్యాధి నుంచి విముక్తులయ్యారని  ఆయన చెప్పారు.

2020లో  2,900 మంది వ్యాధిగ్రస్తుల్లో 95 శాతం మంది కోలుకున్నారు. క్రమం తప్పకుండా మందులు వాడితే ఈ వ్యాధి పూర్తిగా తగ్గుతుందని ఆయన వివరించారు.