Hyderabad: రోడ్డుపై ట్రాఫిక్ హోంగార్డ్‌ను సన్మానించిన హైకోర్టు చీఫ్ జస్టిస్.. ఎందుకంటే..

అబిడ్స్ ట్రాఫిక్ పీఎస్ లో హోంగార్డుగా పనిచేస్తున్న అష్రఫ్ అలీకి ఊహించని అనుభవం ఎదురైంది. అష్రఫ్ అలీ అబిడ్స్ లోని జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ట్రాఫిక్ క్రమబద్దీకరణ విధులు ...

Hyderabad: రోడ్డుపై ట్రాఫిక్ హోంగార్డ్‌ను సన్మానించిన హైకోర్టు చీఫ్ జస్టిస్.. ఎందుకంటే..

Telangana Chief Justice

Hyderabad: అబిడ్స్ ట్రాఫిక్ పీఎస్ లో హోంగార్డుగా పనిచేస్తున్న అష్రఫ్ అలీకి ఊహించని అనుభవం ఎదురైంది. అష్రఫ్ అలీ అబిడ్స్ లోని జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ట్రాఫిక్ క్రమబద్దీకరణ విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం కూడా అక్కడే తన విధుల్లో నిమగ్నమయ్యాడు. ఉదయం 8 గంటల సమయంలో అతడు విధులు నిర్వహించే రూట్ లో కారొచ్చి ఆగింది. ఇంతలోనే ఆ కారులోనుంచి నల్లకోటు వేసుకున్న వ్యక్తి దిగారు. కొద్ది దూరంలోనే విధుల్లో నిమగ్నమై ఉన్న అష్రఫ్ అలీని పిలిచారు.

Telangana RTC : సార్..మా ఊరికి బస్సు వేయించండి…చీఫ్ జస్టిస్‌కు విద్యార్థిని ఉత్తరం

ఎవరై ఉంటారా అనుకుంటూ వెళ్లాడు.. ఇంతలోనే కారు డ్రైవర్ స్పందిస్తూ సార్ ఎవరో తెలుసా.. హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అనే సరికి హోంగార్డు కొంత ఆందోళన చెందాడు. ఇంతలోనే హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ శర్మ కల్పించుకొని హోంగార్డుకు పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. అష్రఫ్ అలీ పని విధానం, డ్యూటీ పట్ల నిబద్ధత తనకు ఎంతగానో నచ్చాయని, బాగా పనిచేస్తున్నారని ప్రశ్నించారు.

Russian Soldiers Killed In War : యుద్ధంలో 18,900 మంది రష్యా సైనికులు మృతి – యుక్రెయిన్ ఆర్మీ

చీఫ్ జస్టిస్ స్థాయి వ్యక్తి అభినందించడంతో ట్రాఫిక్ హోంగార్డ్ అష్రఫ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెటిజర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చీఫ్ జస్టిస్ స్థాయి వ్యక్తి హోంగార్డును అభినందించి, తన పనితీరును మెచ్చుకోవటం గొప్ప విషయమని ప్రశంసిస్తున్నారు. అదేవిధంగా నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న అష్రఫ్ అలీని నెటిజర్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.