CJI Justice NV Ramana : సుప్రీంకోర్టు తీర్పులు తెలుగుతోపాటు అన్ని భాషల్లోకి అనువాదం : సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

హైదరాబాద్ బుక్ ఫెర్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. గత పది రోజులుగా పుస్తకాల పండగ కొనసాగిందని తెలిపారు.

CJI Justice NV Ramana : సుప్రీంకోర్టు తీర్పులు తెలుగుతోపాటు అన్ని భాషల్లోకి అనువాదం : సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

Nv Ramana

Hyderabad Book Fair : సుప్రీంకోర్టు తీర్పులను తెలుగుతోపాటు అన్ని భాషల్లోకి అనువాదాలు చేసి వెబ్ సైట్ లో పెడుతున్నామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు. అది మంచి ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. తెలుగు భాషను, సంస్కృతిని గౌరవించాలన్నారు. హైదరాబాద్ బుక్ ఫెర్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. గత పది రోజులుగా పుస్తకాల పండగ కొనసాగిందని తెలిపారు. కోటిలో ఉన్న విశాలాంధ్ర, నవోదయ పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉండేదన్నారు. అన్ని ప్రచురణ సంస్థల నుంచి పుస్తకాలను ఉంచడం సంతోషమన్నారు.

పుస్తకం రాబోయే రోజుల్లో మనుగడ సాధిస్తుందా..అన్న సమయంలో అనేక మంది యువతి యువకులు రావడం చూస్తే పుస్తకం సజీవంగా ఉంటుందని అనిపిస్తుందని అన్నారు. చిరిగిన చొక్కా వేసుకో…మంచి పుస్తకము కొనుక్కో అంటారు…అని పేర్కొన్నారు. ‘మా స్కూల్ గ్రంధాలయం నాకు చాలా ఉపయోగపడింది…ఇవాళ అటువంటి పరిస్థితులు లేకపోవడం దురదృష్టకరం’ అని పేర్కొన్నారు. ఆట స్థలం, గ్రంధాలయం ప్రతి పాఠశాలలో ఉండాలి.. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి… వాటితోనే స్పోర్ట్స్ స్పిరిట్ వస్తుందన్నారు. పుస్తకం చదవడం.. జ్ఞానాన్ని పెంచుతుందన్నారు.

Somu Veerraju : అమరావతిలోనే ఏపీ రాజధాని : సోము వీర్రాజు

అమ్మ నవల ప్రభావం తనపై చాలా ఉందన్నారు. సాహిత్యం, కవులు రాసిన పుస్తకాలు చాలా ముఖ్యమన్నారు. లేఖలు రాయడం మర్చిపోయారని.. డిజిటల్ యుగంలోకి వెళ్లిపోయారని పేర్కొన్నారు. బావ వ్యక్తీకరణ, విజ్ఞానం పుస్తకాలతోనే అలవడుతుందన్నారు. డిజిటల్ మీడియాలో సినిమా సమీక్షలు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. చాలా మంది ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు తమ జీవితాలను త్యాగం చేశారని..అటువంటి వారి గురించి చదువుకోవాలని సూచించారు.

మహా ప్రస్థానం రాసిన తరవాతనే శ్రీ శ్రీ వెలుగులోకి వచ్చారని పేర్కొన్నారు. కాఫీ కన్న పుస్తకాలు ఎక్కువ కిక్ ఇస్తాయని.. చదవండి..చదివించండి అని అన్నారు. సాహిత్యాన్ని పెంచే పుస్తకాలు చదవండని సూచించారు. బొకేలు, షాల్స్ ఇవ్వడం మాని పుస్తకాలు బహుమతులుగా ఇవ్వండని పిలుపునిచ్చారు. గ్రంధాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపాలి, నిధులు మంజూరు చేయాలన్నారు. ప్రజలు నమ్ముతారనే విశ్వాసం కలిగితే…పుస్తకము రాస్తానని చెప్పారు.

Prakash Javadekar : వైసీపీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌ కరప్షన్‌ పార్టీలు : ప్రకాశ్‌ జవదేకర్‌

అనంతరం పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 2014 నుంచి ప్రారంభమైన పుస్తక ప్రదర్శన…కవులు, కళాకారులకు వేదికగా మారుతుందన్నారు. డిజిటల్ యుగంలో విద్యార్థుల నుంచి పెద్దవాళ్ళ వరకు పుస్తకాలను కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సాధించింది కూడా ఈ పుస్తకాలను చదివేనని స్పష్టం చేశారు. పుస్తక పఠనం పట్ల పిల్లలకు ఆసక్తి కల్పించాలన్నారు. ఇతిహాసం,పురాణాలు, చరిత్ర ఇవన్నీ పుస్తకాలు చదవడంతోనే తెలుసుకోగలుగుతామని చెప్పారు.