CM KCR: తెలంగాణ‌లో 24 గంట‌లు క‌రెంట్ ఇస్తున్నాం.. ఏపీలో కోతలు ఉన్నాయి

కేసుల‌తో అభివృద్ధిని అడ్డుకోవాల‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు.

CM KCR:  తెలంగాణ‌లో 24 గంట‌లు క‌రెంట్ ఇస్తున్నాం.. ఏపీలో కోతలు ఉన్నాయి

Kcr (1)

CM KCR Speech: కేసుల‌తో అభివృద్ధిని అడ్డుకోవాల‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా పాల‌మూరులో పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేశామ‌ని, సాహ‌సం చేయకుంటే ఏ పని పూర్తికాదని అన్నారు కేసీఆర్. క‌ల‌లు క‌ని.. ఆ క‌ల‌ల‌ను శ్వాసిస్తే అభివృద్ధి సాకారం అవుతుందని అన్నారు కేసీఆర్.

రైతులకు మేలు చేసే నిర్ణయాల వల్లే, తెలంగాణ‌లో అద్భుతంగా వ్య‌వ‌సాయ స్థీరీక‌ర‌ణ జ‌రిగిందన్నారు కేసీఆర్. మ‌నం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు త‌ల‌సరి ఆదాయం రూ.లక్షా 70వేల కోట్లేనని, తెలంగాణ త‌ల‌స‌రి ఆదాయం మాత్రం రూ. 2లక్షల 35వేల కోట్లకు పెరిగిందని అన్నారు కేసీఆర్.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డితే క‌రెంట్ ఉండదని ఆంధ్రా నాయకులు అప్పుడు అన్నారు. కానీ తెలంగాణ‌లో 24 గంట‌ల నాణ్య‌మైన క‌రెంట్ ఇస్తున్నామని, ఆంధ్రాలో 24గంట‌ల క‌రెంట్ ఇచ్చే ప‌రిస్థితి లేదన్నారు కేసీఆర్. అన్ని రంగాల్లో తెలంగాణ ప్ర‌భుత్వం స‌ఫ‌లీకృత‌ం అవుతుందని, రాబోయే రోజుల్లో ఇంకా మార్పులు వస్తాయని అన్నారు కేసీఆర్.