Casino Case : తెలంగాణలో మళ్లీ చీకోటి క్యాసినో కేసు కలకలం.. తెరపైకి కొత్త వ్యక్తులు, ఎమ్మెల్సీతో సహా ప్రముఖులకు ఈడీ నోటీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ అధికారులు మరోసారి దర్యాఫ్తు ముమ్మరం చేశారు. తెలంగాణలో పలువురు రాజకీయ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది.

Casino Case : తెలంగాణలో మళ్లీ చీకోటి క్యాసినో కేసు కలకలం.. తెరపైకి కొత్త వ్యక్తులు, ఎమ్మెల్సీతో సహా ప్రముఖులకు ఈడీ నోటీసులు

Casino Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ అధికారులు మరోసారి దర్యాఫ్తు ముమ్మరం చేశారు. తెలంగాణలో పలువురు రాజకీయ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, మెదక్ డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. హవాలా, ఫెమా చట్టం ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ నోటీసులు జారీ చేసింది.

దీనిపై మెదక్ డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి స్పందించారు. తనకు నోటీసులు అందలేదని ఆయన వెల్లడించారు. ఈ కేసులో తలసాని మహేశ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లను విచారిస్తోంది ఈడీ. క్యాసినో డాన్ చీకోటి ప్రవీణ్ తో ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మనీ ల్యాండరింగ్, క్యాసినో వ్యవహారంపై ప్రశ్నిస్తున్నారు. చీకోటి ప్రవీణ్ తో కలిసి తలసాని మహేశ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లు విదేశాలకు వెళ్లినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పలువురికి నోటీసులు ఇచ్చిన ఈడీ.. ఈ నెల 17, 18 తేదీల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి చికోటి ప్రవీణ్ ను ఈడీ పలుసార్లు విచారించింది. చీకోటి ప్రవీణ్ ఇంట్లో, కార్యాలయాల్లో సోదాలు చేసింది. ఈ విచారణలో చికోటి ప్రవీణ్ లావాదేవీలపై కీలక సమాచారం లభించింది. నేపాల్, శ్రీలంకలో కూడా క్యాసినో ఆడినట్లు గుర్తించారు. అతని కాంటాక్ట్ లిస్ట్ లో వందలాది మంది ప్రముఖులు ఉన్నట్లు ఈడీ అధికారులు తెలుసుకున్నారు. అలాగే మనీలాండరింగ్ కు సంబంధించి ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం.

 

కాగా తెలంగాణలో ఈడీ వరుస రైడ్స్ తో దూకుడు పెంచింది. నిన్న, మొన్నటి వరకు గ్రానైట్ కు సంబంధించి మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు, కార్యాలయాలతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు జరిపారు. ఇక తాజాగా క్యాసినో కేసులో ఈడీ మళ్లీ విచారణను వేగవంతం చేసింది.