Chinna Reddy: 2వ తేదీ ఒక ముఖ్యమైన రోజు.. ఎందుకంటే?: మాజీ మంత్రి చిన్నారెడ్డి

గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపానికి మొదట నివాళులు అర్పిస్తామని చిన్నారెడ్డి చెప్పారు.

Chinna Reddy: 2వ తేదీ ఒక ముఖ్యమైన రోజు.. ఎందుకంటే?: మాజీ మంత్రి చిన్నారెడ్డి

జి. చిన్నారెడ్డి (Photo: FB)

Chinna Reddy – Telangana Formation Day 2023: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు.

“ఈ నెల 2వ తారీఖు ఒక ముఖ్యమైన రోజు.. దాదాపు 65 ఏళ్లు తెలంగాణ కోసం పోరాడాం. జూన్ 2న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరిన రోజు. సోనియా గాంధీ లేకపొతే తెలంగాణ వచ్చేది కాదు అని స్వయానా కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా చేస్తాం అని చెప్పుకుంటున్నారు.

అసలు ఈ తొమ్మిదేళ్లలో ఎటువంటి అభివృద్ధి జరిగింది? ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జూన్ 2న ప్రతి జిల్లాలలోని పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకం ఎగురవేయాలని నిర్ణయించాం.

సోనియా గాంధీ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేయాలని నిర్ణయించాం. ఆయా జిల్లాలలో ర్యాలీ కార్యక్రమాలు బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వారికి సన్మాన కార్యక్రమాలు ఉంటాయి. 3,4,5 తేదీల కార్యక్రమాలు త్వరలో చెబుతాము. గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపానికి మొదట నివాళులు అర్పిస్తాము. బాబూ జగజ్జీవన్ రావు విగ్రహానికి నివాళులర్పిస్తాం. భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం” అని చిన్నారెడ్డి చెప్పారు.

Telangana Formation Day 2023: జూన్ 2న తెలంగాణలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ ర్యాలీలు.. ఇంకా