Corona Effect: మరోసారి పెద్ద సినిమాలకు కరోనా టెన్షన్

కరోనా వైరస్ ధాటికి 8నెలలుగా మూతబడ్డ థియేటర్లు వెలవెలబోతుండగా.. ఎట్టకేలకు 50శాతం ఆక్యుపెన్సీతో మొదలుపెట్టి 100శాతానికి పెంచే ప్లాన్ చేశారు. సినిమా చూడటానికి..

Corona Effect: మరోసారి పెద్ద సినిమాలకు కరోనా టెన్షన్

Cinema Theatres Will Close Again Due To Corona

Corona Effect: కరోనా వైరస్ ధాటికి 8నెలలుగా మూతబడ్డ థియేటర్లు వెలవెలబోతుండగా.. ఎట్టకేలకు 50శాతం ఆక్యుపెన్సీతో మొదలుపెట్టి 100శాతానికి పెంచే ప్లాన్ చేశారు. సినిమా చూడటానికి ప్రేక్షకులు థియేటర్స్ వరకూ వస్తారా అనే సందేహాలను తుడిచేస్తూ.. కొన్ని సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. విజయాన్ని చవిచూసిన సినిమాలు ప్రేరణగా భారీ బడ్జెట్ మూవీస్ కూడా రిలీజ్ అయ్యేందుకు రెడీ అయిపోయాయి. ఈ వారం రాబోయే అరణ్య, రంగ్ దే సినిమాలకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందనే అనుమానాలు మొదలయ్యాయి.

అసలు సమస్య ఇదే.. ప్రతీ శుక్రవారం కనీసం రిలీజ్ అయిన మూడు నాలుగింటిలో కనీసం ఒక్కటైనా హిట్ అయ్యేది. కానీ 2021లో తొలిసారి శుక్రవారం పూర్తిగా కనుమరుగైపోయింది. మూడు చెప్పుకోదగ్గ సినిమాలు విడుదలైనా కూడా ఒక్కటి కూడా రెండో రోజుకు చెప్పుకునేలా కలెక్షన్స్ సాధించలేదు.

గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ నుంచి వచ్చిన చావు కబురు చల్లగా.. రూ.50 కోట్లు పెట్టి నిర్మించానని చెప్పిన మంచు విష్ణు మోసగాళ్లు.. ఆది సాయికుమార్ శశి సినిమాలకు కనీస స్పంద‌న రాలేదు. దాంతో ఏం చేయాలో తెలియక థియేట‌ర్స్‌ మూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.

కనీసం మెయింటైనెన్స్ ఖర్చులు రాకపోవడం, 10 శాతం పబ్లిక్ కూడా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. మార్చి 19న చావు కబురు చల్లగా, మోసగాళ్లు, శశి సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఈ మూడింటికి కూడా వసూళ్లు దారుణంగా ఉన్నాయి.

థియేటర్స్ ‌లో కనీసం 10 శాతం మంది కూడా లేకపోవడంతో షోలు క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి. మ‌ల్టీప్లెక్సుల్లోనూ షోలు తగ్గించేశారు. సింగిల్ స్క్రీన్లు చాలా ఏరియాల్లో షోలు ఆపేశారు. కరోనా కేసులు మరోసారి చెలరేగుతుండటంతో నిర్మాతలతో పాటు ఎగ్జిబిటర్లు కూడా దిక్కు తోచని పరిస్థితుల్లో ఉండిపోయారు.