Rains In Hyderabad: హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం: ఉపశమనం పొందిన నగర వాసులు

శనివారం సాయంత్రం పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో.. వేడి, ఎండ తీవ్రత నుంచి నగర వాసులు కాస్త ఉపశమనం పొందారు.

Rains In Hyderabad: హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం: ఉపశమనం పొందిన నగర వాసులు

Rains

Rains In Hyderabad: హైదరాబాద్ నగరంలో శనివారం సాయంత్రం పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో.. వేడి, ఎండ తీవ్రత నుంచి నగర వాసులు కాస్త ఉపశమనం పొందారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఏప్రిల్ కూడా దాటకముందే రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గత వారం రోజులుగా హైదరాబాద్ నగరంలోనూ విపరీతమైన ఎండ, వడగాలులు వీస్తున్నాయి. ఈక్రమంలో శనివారం మధ్యాహ్నం నుంచి నగరంలో వాతావరణం కాస్త చల్లబడింది. సాయంత్రానికి నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.

Also read: Andhra Pradesh Covid 19 : ఏపీలో కరోనా తగ్గుముఖం, నాలుగు జిల్లాల్లో సున్నా కేసులు

నగరంలోని తార్నాక, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్, నాచారం, అంబర్పేట్, సైదాబాద్, చంపాపేట్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్డుపై నిలిచి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. దిల్‌సుఖ్‌నగర్, మలక్పేట్, చైతన్యపురి, సరూర్ నగర్, ఉప్పల్, ఘట్కేసర్ పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దూలపల్లి, దుండిగల్, సూరారం, బహదూర్పల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక ఆదివారం నగరంలో పొడి వాతావరణమే ఉంటుందని.. సోమవారం కూడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Also read: Cyclone Asani: రానున్న 48 గంటల్లో తుఫాను తీవ్రతరం: అండమాన్ నికోబార్ దీవులకు ప్రమాద హెచ్చరికలు