CJI NV Ramana : సుప్రీం చీఫ్ జస్టిస్ కు తేనీటి విందు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ‌కు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ ఈరోజు సాయంత్రం తేనీటి విందు ఇచ్చారు.

CJI NV Ramana : సుప్రీం చీఫ్ జస్టిస్ కు తేనీటి విందు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్

Cji Nv Ramana

CJI NV Ramana :  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ‌కు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ ఈరోజు సాయంత్రం తేనీటి విందు ఇచ్చారు. జస్టిస్ ఎన్వీరమణకు జస్టిస్ హిమా కోహ్లీ, ఎపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనూప్ కుమార్ గోస్వామి స్వాగతం పలికారు.

వారితో పాటు తెలంగాణ హై‌కోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు, హైకోర్టు ఉద్యోగుల కూడా ఈ కార్యక్రమానికి హజరయ్యారు. దీంతో చీఫ్ జస్టిస్ ఇంటి సమీపంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తేనీటి విందులో పాల్గొన్నారు.

ఈరోజు మధ్యాహ్నం  తెలంగాణ బార్ కౌన్సిల్ ప్రతినిధులు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను రాజ్ భవన్ లో మర్యాద  పూర్వకంగా కలిసారు. హై కోర్టులో జడ్జిల సంఖ్య పెంచినందుకు వారు ఆయనకు ధన్యావాదాలు తెలిపారు. కాగా  హైదరాబాద్ శామీర్‌పేటలో న్యాయవాదుల శిక్షణా సంస్ధను ఏర్పటు చేయాలని బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి  ఎన్వీరమణను కోరారు.