Huzurabad : హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిపై రేపు క్లారిటీ

బీజేపీ, టీఆర్ఎస్, వైఎస్సార్ పార్టీలపై కాంగ్రెస్ తెలంగాణ కమిటీ ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు.

Huzurabad : హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిపై రేపు క్లారిటీ

Congress (1)

Huzurabad Congress candidate : బీజేపీ, టీఆర్ఎస్, వైఎస్సార్ పార్టీలపై కాంగ్రెస్ తెలంగాణ కమిటీ ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీతో దోస్తీ ఉందని ఆరోపించారు. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ పడతాయని ఎద్దేవా చేశారు.

అవినీతి అక్రమాలు అంటున్న బీజేపీ లిఖిత పూర్వకంగా ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. బండి సంజయ్ అమిత్ షాకు, ఈడీకి పిర్యాదు చేయాలన్నారు. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ ఎంపీపై చేస్తున్న ఫిర్యాదులు తెలంగాణలో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

2023 నాటికి కాంగ్రెస్ అధికారమే లక్ష్యం గా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 70 సీట్లు సాధించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలన్నారు. బూత్ స్థాయి నుంచి సన్నద్ధం కావాలని తెలిపారు.

పార్లమెంట్ పరిధిలో త్వరలో బై ఎలక్షన్ రాబోతుందన్నారు మాణిక్కమ్ ఠాగూర్. రేపటి సమావేశంలో హుజూరాబాద్ అభ్యర్థి ఫైనల్ అవుతుందన్నారు. మంత్రి గంగుల కమలాకర్ పై ఈడీ విచారణ జరగాలని పేర్కొన్నారు.