పాల్వంచ ప్రభుత్వ బీసీ బాయ్స్‌ హాస్టల్‌లో కొట్టుకున్న విద్యార్థులు.. సిగరెట్లు తాగే విషయంలో ఘర్షణ

పాల్వంచ ప్రభుత్వ బీసీ బాయ్స్‌ హాస్టల్‌లో కొట్టుకున్న విద్యార్థులు.. సిగరెట్లు తాగే విషయంలో ఘర్షణ

Clashes between students : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ బీసీ బాయ్స్‌ హాస్టల్‌లో విద్యార్థుల వీరంగం సృష్టించారు. వార్డెన్‌ సాక్షిగా రెండు విద్యార్థి వర్గాలు కొట్లాటకు దిగారు. సిగరెట్లు తాగే విషయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొనగా… మాట మాట పెరిగి ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుప్పించుకున్నారు.

హాస్టల్‌లో చెడు వ్యసనాలకు బానిసయ్యారని భావిస్తున్న కొందరు విద్యార్థులు ఒక బ్యాచ్‌గా.. ఏ అలవాట్లు లేని స్టూడెంట్స్ మరో గ్రూప్‌గా విడిపోయి బాహాబాహీకి దిగారు. విచక్షణలేకుండా విద్యార్థులు కొట్టుకున్నారు. పోలీసుల ఎంట్రీతో విద్యార్థులు శాంతించారు.

కాగా విద్యార్థులపై హాస్టల్‌ వార్డెన్‌ క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ ఘర్షణపై వార్డెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి.