Warangal : వరంగల్‌ లో విద్యార్థుల మధ్య ఘర్షణ..బిల్డింగ్‌పై నుంచి నెట్టడంతో కిందపడి స్టూడెంట్ మృతి

వరంగల్‌ జిల్లా నర్సంపేటలో దారుణం జరిగింది. బిల్డింగ్‌పై నుంచి నెట్టడంతో కిందపడి ఓ స్టూడెంట్ మృతి మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

10TV Telugu News

Student killed in Warangal : వరంగల్‌ జిల్లా నర్సంపేటలో దారుణం జరిగింది. బిల్డింగ్‌పై నుంచి నెట్టడంతో కిందపడి ఓ స్టూడెంట్ మృతి మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది.

హాస్టల్ గదిలో విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ క్రమంలో బిల్డింగ్‌పై నుంచి నెట్టడంతో ఓ విద్యార్థి కిందపడి మృతి చెందాడు. మృతుడు పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ విద్యార్థి సంజయ్‌గా గుర్తించారు. విద్యార్థి మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

Attack : హైదరాబాద్ లో దారుణం..డీజిల్‌ పోసి విచాక్షణారహితంగా దాడి

మృతుడి స్వగ్రామం కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామం. తమ కుమారుడు చనిపోవడంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బంధువులు బోరున విలిపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.