CM KCR‌ : తెలంగాణ ప్రజలకు, రైతులకు సీఎం కేసీఆర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు, రైతులకు సీఎం కేసీఆర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందన్నారు.

CM KCR‌ : తెలంగాణ ప్రజలకు, రైతులకు సీఎం కేసీఆర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

Kcr (1)

CM KCR‌ Sankranthi wishes : సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు లోగిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఇళ్లముందు తెల్లవారు జామునే కల్లాపి చల్లి , ఎంతో అందమైన ముగ్గులను ఆడపడుచులు తమ వాకిళ్లలో అలంకరిస్తున్నారు. వాటి మధ్యలో గొబ్బెమ్మలు కొలువుదీరుతున్నాయి. హరిదాసు కీర్తనలు, బసవన్నల నాట్యాలు, పతంగుల రెపరెపలతో పల్లెల్లో పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది. నిన్న భోగిమంటలు వెలిగించి పండగకు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పారు ప్రజలు. నేడు మకర సంక్రాంతి జరుపుతున్నారు. రేపు కనుమతో సంక్రాంతి ముగియనుంది.

తెలంగాణ ప్రజలకు, రైతులకు సీఎం కేసీఆర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు సిరి, సంపదలతో తులతూగాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. స్వరాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసుకున్నామన్న ఆయన.. రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చామన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు.

Sankranthi : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు

ఏపీ, తెలంగాణలో నిన్న భోగి వేడుకలతో సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. వేకువజామున చీకట్లను చీల్చుకుంటూ భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. వాడవాడలా భోగిమంలు వేసి.. చిన్నాపెద్దా సందడి చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భోగిమంటలు వెలిగించి.. పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. భోగి మంటల్లో పాత సామాగ్రి వేసి అగ్ని దేవున్ని ప్రార్థిస్తున్నారు.

భోగి మంటల చుట్టూ ప్రదక్షిణలు చేసి సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుకున్నారు. వాడవాడలా చిన్నాపెద్దా సందడి చేశారు. దీంతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. గంగిరెద్దుల ఆటపాటలతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇటు బోర్డర్‌లో గస్తీ కాస్తున్న జవాన్‌లు కూడా సరిహద్దుల్లోనే భోగి మంటలు వెలిగించి డ్యాన్సులు చేశారు.