Raj Bhavan At Home Program : రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం.. హాజరుకాని సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు

తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు హాజరు కాలేదు.

Raj Bhavan At Home Program : రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం.. హాజరుకాని సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు

Raj Bhavan

Raj Bhavan At Home Program : తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు హాజరు కాలేదు. చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, అధికారుల, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నేతలు హాజరయ్యారు. ఇప్పటికే గవర్నర్ కు, సీఎం కేసీఆర్ కు మధ్య అగాధం నెలకొంది. అయితే ఈ రోజు సాయంత్రం హాజరవుతారా లేదా అని గవర్నర్ గతంలోనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి సీఎం కేసీఆర్.. ఉదయం రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు కాలేదు. ఇప్పుడు రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమానికి కూడా హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

గత ఏడాదిన్నర కాలంగా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి విషయంలో నెలకొన్న విబేధాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇది ఈ రోజు మరింత ముదిరి పాకాన పడ్డాయి. గవర్నర్ నేరుగా ఈ రోజు ఉదయం రాజ్ భవన్ లో జరిగిన గణతంత్ర దినోత్స వేడుకల సందర్భంగా కూడా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై గవర్నర్ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతి రోజు 22 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పుదుచ్చేరిలో కూడా మీడియాతో మాట్లాడుతూ మరిన్ని కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

Tamilisai: తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం: గవర్నర్ తమిళిసై

తెలంగాణ సర్కార్ పై మరోసారి గవర్నర్ తమిళిసై విమర్శలు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించిన తీరుపై పుదుచ్చేరిలో విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని మండిపడ్డారు. పుదుచ్చేరిలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సర్కార్ టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యం లేకుండా రిపబ్లిక్ డేను నిర్వహించిందని పేర్కొన్నారు.

కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను కూడా పాటించలేదన్నారు. ప్రభుత్వ తీరును హైకోర్టు ఖండించినా..పరేడ్, రిపబ్లిక్ డేను నిర్వహించాలని చెప్పినా.. పట్టించుకోలేదన్నారు. సమయా భావాన్ని కారణంగా చూపించి రాజ్ భవన్ కే రిపబ్లిక్ డే వేడుకలను పరిమితం చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా సాకుతో రిపబ్లిక్ డే వేడుకలకు అనుమతి ఇవ్వలేదన్నారు. ఖమ్మం సభలో లేని కరోనా రిపబ్లిక్ డే వేడుకలకు వచ్చిందా అని ప్రశ్నించారు. అటు రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్ వస్తారని తాను ఆశించలేదన్నారు.

Governor Tamilisai : గవర్నర్ ను సీఎం కేసీఆర్ అవమానించారు : గవర్నర్ తమిళిసై

రెండేళ్లుగా ఈ తంతు జరుగుతూనే ఉందని తెలిపారు. ఈ సారి రిపబ్లిక్ డే వేడుకలను ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా జరపాలని రెండు నెలల క్రితమే లేఖ రాశానని.. కానీ ప్రభుత్వం రెండు రోజుల క్రితమే తనకు సమాధానం ఇచ్చిందని తెలిపారు. ఈ సారి రిపబ్లిక్ డేను రాజ్ భవన్ లోనే చేసుకోవాలని చెప్పిందన్నారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ మాత్రమే హాజరవుతారని అందులో ఉందన్నారు. తెలంగాణ ప్రజలు ఇదంతా చూస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై కేంద్రానికి నివేదిక పంపుతానని చెప్పారు. రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి తాను రిపోర్టు పంపించానని పేర్కొన్నారు.