CM KCR : రజనీకాంత్ కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్

ఈ నెల 25న హైదరాబాద్ నగరం మణికొండలో నాలాలో పడి చనిపోయిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రజనీకాంత్(42) కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి మణికొండ

10TV Telugu News

CM KCR : ఈ నెల 25న హైదరాబాద్ నగరం మణికొండలో నాలాలో పడి చనిపోయిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రజనీకాంత్(42) కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి మణికొండ మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజినీర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే నాలా మరమ్మతులు జరుగుతున్న సమయంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు, చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్ రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని నార్సింగి పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 25న రాత్రి 9గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. అదే సమయంలో మరమ్మతుల కోసం తీసిన నాలా గుంతలో పడి రజనీకాంత్‌ గల్లంతయ్యారు. సోమవారం ఆయన మృతదేహం నెక్నాంపూర్‌ చెరువులో లభ్యమైంది.

మణికొండలో రోడ్డు దాటుతున్న సమయంలో మూతలేని మ్యాన్ హోల్ లో రజనీకాంత్ పడి కొట్టుకుపోయారు. మూడు రోజులుగా రజనీకాంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం నెక్నామ్ చెరువులో గుర్తు తెలియని మృతదేహన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బురదలో ఈ మృతదేహం కూరుకుపోయింది. ఆ డెడ్‌బాడీ రజనీకాంత్‌దిగా గుర్తించారు.

Bamboo Plants : ఎకరం భూమి.. ఏడేళ్లలో రూ.17లక్షల ఆదాయం.. ఆ రైతు ఏం పండించాడంటే

మణికొండలోని గోల్డెన్ టెంపుల్ ఏరియాలో మూడు నెలలుగా డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ విషయమై అధికారులు ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదు. ఇదే ప్రాంతంలో రోడ్డు దాటుతున్న రజనీకాంత్ ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి మరణించారు. మూడు రోజుల తర్వాత ఆయన డెడ్ బాడీ లభించింది.

పెరుగు కోసం వెళ్లి..
రజనీకాంత్ భార్య స్వప్న ప్రైవేటు ఉద్యోగి. ఇద్దరు పిల్లలున్నారు. రాంనగర్‌కు చెందిన రజనీకాంత్‌, స్వప్న దంపతులు ఆరేళ్ల క్రితం మణికొండ పరిధి సెక్రటేరియేట్‌ కాలనీలోని బాబానివాస్‌ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాటు కొనుగోలు చేసి అక్కడే ఉంటున్నారు. షాద్‌నగర్‌ దగ్గర సాఫ్ట్‌వేర్‌ సంస్థలో రజనీకాంత్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో బయటకు వెళ్లిన రజనీకాంత్‌ కొద్ది సమయానికే ఇల్లు చేరారు. 9 గంటల సమయంలో మరోసారి పెరుగు కోసం బయటకు వచ్చారు. పెరుగు ప్యాకెట్‌ తీసుకుని ఇల్లు చేరేందుకు బయల్దేరారు. రాత్రి 9.14 గంటల సమయంలో గోల్డెన్‌టెంపుల్‌ ఎదురుగా ఉన్న డ్రైనేజీ మీదున్న మార్గం మీదుగా వెళ్తూ మురుగుకాల్వలో పడిపోయారు.

Bank Customers : బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

అప్పటికే అక్కడ భారీగా వరదచేరటంతో కాల్వలో కొట్టుకుపోయారు. సమీపంలోని చారి అనే వ్యక్తి వరదను చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాద ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో నాలాలు కలిసే నెక్నాంపూర్‌ చెరువులో ఆదివారం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. మూడోరోజు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నెక్నెంపూర్‌ చెరువులో గుర్రపుడెక్క తొలగిస్తుండగా రజనీకాంత్‌ మృతదేహం బయటపడింది. కాగా, 42 గంటల పాటు నీటిలోనే ఉండటంతో ముఖం గుర్తుపట్టలేనంతగా మారింది. నీలి రంగు చొక్కా ఆధారంగా రజనీకాంత్‌ అని నిర్ధారించారు.