CM KCR : వరద బాధితులకు టీ.సర్కార్‌ భరోసా..బాధిత కుటుంబాల‌కు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం

భ‌ద్రాచ‌లంలోని వ‌ర‌ద ముంపు బాధిత కుటుంబాల‌కు 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. భ‌ద్రాచలం, పిన‌పాక‌లో వ‌ర‌ద‌ స‌మ‌స్యకు శాశ్వత ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్యలు చేప‌డుతామ‌న్నారు. ముంపున‌కు గుర‌య్యే ప్రాంతాల ప్రజ‌ల‌కు ఎత్తైన ప్రదేశంలో వెయ్యి కోట్లతో కొత్త కాల‌నీ నిర్మించి 3వేల ఇళ్లు కట్టిస్తామ‌ని సీఎం హామీ ఇచ్చారు.

CM KCR : వరద బాధితులకు టీ.సర్కార్‌ భరోసా..బాధిత కుటుంబాల‌కు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం

Kcr

CM KCR : వరద బాధితుల విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని.. సమయస్ఫూర్తితో వారిని ఆదుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. పునరావాసకేంద్రాల్లో ఉన్న వరద బాధితులకు హెల్త్ చెకప్ చేయించాలని సూచించారు. భద్రాచలం నుంచి ఏటూరు నాగారంలోని రామన్నగూడెం వరకు సీఎం కేసీఆర్ ఏరియ‌ల్ స‌ర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరీశీలించారు. కరకట్ట వద్ద ఏర్పాటు చేసిన ముంపు బాధితుల పునరావాస కేంద్రానికి వెళ్లి, వారిని పరామర్శించారు. అనంతరం ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదికి సీఎం శాంతి పూజలు చేశారు.

భ‌ద్రాచ‌లంలోని వ‌ర‌ద ముంపు బాధిత కుటుంబాల‌కు 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. భ‌ద్రాచలం, పిన‌పాక‌లో వ‌ర‌ద‌ స‌మ‌స్యకు శాశ్వత ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్యలు చేప‌డుతామ‌న్నారు. ముంపున‌కు గుర‌య్యే ప్రాంతాల ప్రజ‌ల‌కు ఎత్తైన ప్రదేశంలో వెయ్యి కోట్లతో కొత్త కాల‌నీ నిర్మించి 3వేల ఇళ్లు కట్టిస్తామ‌ని సీఎం హామీ ఇచ్చారు.

Heavy Rains : నేడు తెలంగాణలో భారీ వర్షాలు

గోదావరి ఉగ్రరూపం దాల్చినా.. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. భ‌ద్రాచ‌లం, పిన‌పాక నియోజ‌క‌వ‌ర్గాలు వరదలతో చాలా దెబ్బతిన్నాయన్నారు. పోలీసు, ఎన్డీఆర్ఎఫ్‌, ఆర్మీ బలగాలు స‌హాయ‌క చ‌ర్యల్లో పాల్గొన్నాయన్నారు. కొత్తగూడెం, ఖ‌మ్మం క‌లెక్టర్లు అద్భుతంగా పనిచేశారన్నారు.

సమీక్షలో అటవీశాఖ అధికారులపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు డీఎఫ్‌వో ప్రదీప్ కుమార్‌ను మందలించారు. శాపల్లి బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకోవడంపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. అటవీప్రాంతంలో రోడ్డు వేయొద్దంటే ఎలా అని నిలదీశారు. రోడ్డు వేయకపోతే గిరిజనులకు రేషన్ ఎలా అందుతుందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.