CM KCR : రైతులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు నిర్ణయం

CM KCR: వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలంటూ సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

CM KCR : రైతులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు నిర్ణయం

CM KCR : రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. యాసంగి ధాన్యం కొనుగోలుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. దీనికోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్.

వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలంటూ సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అంతేకాదు.. రేపే (ఏప్రిల్ 10) కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ ను ఆదేశించారు కేసీఆర్.

Also Read..Harish Rao Thanneeru : ప్రధాని మోదీ.. తెలంగాణపై విషాన్ని కక్కడానికే వచ్చినట్లుంది- హరీశ్ రావు

రాష్ట్రవ్యాప్తంగా 7వేల కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు, సీఎస్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలిచ్చారు. యాసంగి వరి ధాన్యాన్ని ఇప్పటికే కళ్లాల్లో పోస్తున్న పరిస్థితి ఉంది. గతంలో మాదిరి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు జరగాలని అధికారులతో చెప్పారు కేసీఆర్. కేంద్రం కొన్నా కొనకపోయినా యాసంగి వరి ధాన్యం మేమే కొంటామని ప్రభుత్వం చెప్పింది.

గత ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుండి మరీ రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసింది. అదే విధంగా ఈసారి కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో ఏయే జిల్లాలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి? ఎక్కడ ఏర్పాటు చేయాలి? అనేదానిపై చర్చించనున్నారు.

Also Read..Jupalli Krishna Rao : బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి : జూపల్లి కృష్ణారావు

ధాన్యం ఎక్కువగా పండిన జిల్లాల్లో అవసరమైతే అయా చోట్ల ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రైతులు దూరం వెళ్లాల్సిన పని లేకుండా అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.