TS Lockdown : తెలంగాణలో లాక్ డౌన్ పై సీఎం కేసీఆర్ క్లారిటీ

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ప్రకటిస్తుందా ? కర్ఫ్యూ విధిస్తారా ? అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.

TS Lockdown : తెలంగాణలో లాక్ డౌన్ పై సీఎం కేసీఆర్ క్లారిటీ

Ts lock down

CM KCR  : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ప్రకటిస్తుందా ? కర్ఫ్యూ విధిస్తారా ? అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. 400 పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇతర రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ విధిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠకు సీఎం కేసీఆర్ తెర దించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కరోనా వైరస్ గురించి మాట్లాడారు. ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

2021, మార్చి 26వ తేదీ శుక్రవారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ…
‘కరోనా వైరస్ నియంత్రించే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటోంది. ఈ విషయంలో ప్రభుత్వం పకడ్బంది చర్యలు తీసుకొందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. టెస్టుల సంఖ్యను పెంచాం. ఒక్కరోజులోనే 70 వేల టెస్టులు చేస్తున్నాం. విస్పోటమైన రూపం తీసుకోక ముందే చర్యలు తీసుకుంటున్నాం. గతంలో సినిమా ఇండస్ట్రీ వారు తన దగ్గరకు వచ్చారు. సినిమా రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం…వారికి అనుమతులు ఇచ్చాం. మరలా ఇటీవలే వచ్చారు. భారీ బడ్జెట్ సినిమాలున్నాయి. థియేటర్లు మూసివేస్తారా ? మూసివేస్తే..చాలా నష్టపోతామని చెప్పారు. విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.

ప్రపంచం మొత్తం దీనిని ఎదుర్కొంటోంది. దీనివల్ల దుష్పలితాలు వస్తున్నాయి. గతంలో కొన్ని వ్యాధులు వచ్చాయి. కొన్ని నెలల పాటు ఉండి అంతరించిపోయాయి. కానీ..కరోనా మాత్రం సంవత్సరాల తరబడి ఉంటోంది. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నాం. జీడీపీ విషయంలో తెలంగాణ చాలా మెరుగ్గా ఉంది. 1.3 శాతం జీడీపీ ఉంది. 10.85 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. ప్రధాన మంత్రి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో తమ అభిప్రాయాలు వెల్లడిస్తాం. రాష్ట్రానికి రావాల్సిన కోటా వస్తుంది. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం.

బాధతో తాత్కాలికంగా విద్యా సంస్థలు మూసివేశాం. తొందర పడి లాక్ డౌన్ పెట్టం. పరిశ్రమల మూసివేత ఉండదు. ఎలాంటి గాభరా పడొద్దు. కరోనాను నియంత్రిస్తూనే..మాస్క్, శానిటైజేషన్, భౌతిక దూరం తప్పకుండా పాటించాలి. దీనివల్ల..కరోనా వైరస్ ను నియంత్రించే అవకాశం ఉంది. ప్రజలందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి’. అని సీఎం కేసీఆర్ చెప్పారు.