CM KCR : మేం పెట్రోల్ రేట్ పెంచలేదు.. తగ్గించం : సీఎం కేసీఆర్

మేము ఒక్క రూపాయి వ్యాట్ పెంచలేదు. మేం వ్యాట్ తగ్గించాల్సిన అవసరం లేదు.

CM KCR : మేం పెట్రోల్ రేట్ పెంచలేదు.. తగ్గించం : సీఎం కేసీఆర్

Cm Kcr On Petrol2

CM KCR : తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తావుంటే తాను చూస్తూ ఊరుకోనని చెప్పారు సీఎం కేసీఆర్. పెట్రోల్, డీజిల్ రేట్లపై సెస్ ను కేంద్రమే పెంచిందన్నారు. సెస్ పెంచి రాష్ట్రాల వాటాను కేంద్రం ఎగ్గొట్టిందన్నారు సీఎం. పెట్రోల్ సెస్ ను పెంచిన కేంద్రం… దేశంలో పప్పులు, ఉప్పులు సహా అన్ని ధరలు పెరిగేందుకు కారణమైందని ఆరోపించారు. ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు పెరగడంతో.. అన్నింటి రేట్లు పెరిగాయన్నారు. వెంటనే పెట్రోల్ పై కేంద్రం పెంచిన సెస్ మొత్తాన్ని విరమించుకోవాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Read This : CM KCR: బండి సంజయ్… నన్ను టచ్ చేసి చూడు.. బిడ్డా బతుకుతావా? -కేసీఆర్

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ రేట్ల వ్యాట్ ను తగ్గించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ అన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రపంచంలో ఏ దేశం పెంచలేదన్నారు. కేంద్రమే సెస్ పెంచుతూ పోయిందని.. గతంలో ఎంత వ్యాట్ ఉందో అంతే వ్యాట్ తెలంగాణలో కొనసాగుతోందన్నారు.

“మేము ఒక్క రూపాయి వ్యాట్ పెంచలేదు. మేం వ్యాట్ తగ్గించాల్సిన అవసరం లేదు. పెట్రోల్, డీజిల్ పై తెలంగాణలో వ్యాట్ తగ్గించం. పెట్రోల్ డీజిల్ పై సెస్ రద్దు చేయాలని మేమే పోరాటం చేస్తాం. పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్రం అడ్డదారిలో.. దొడ్డిదారిలో పెంచింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడమే తప్పు.” అని కేసీఆర్ కేంద్రంపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు.

Read This : CM KCR: ధాన్యం కొనేదిలేదని కేంద్రం స్పష్టంగా చెప్పేసింది -సీఎం కేసీఆర్