CM KCR : ఎంతటివారైనా వదలొద్దు.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

తెలంగాణను డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. పరిస్థితి తీవ్రతరం కాకముందే

CM KCR : ఎంతటివారైనా వదలొద్దు.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

Cm Kcr Ganja Drugs

CM KCR : తెలంగాణను డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. పరిస్థితి తీవ్రతరం కాకముందే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయిని నిర్మూలించేందుకు యుద్ధం ప్రకటించాల్సిన అవసరం వచ్చిందన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై ప్రత్యేక రివ్యూ చేపట్టిన సీఎం.. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఉన్నతస్థాయి సమావేశంలో విస్తృతంగా చర్చించి గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

Google User Data : యూజర్ చనిపోతే వారి డేటాను గూగుల్ ఏం చేస్తుందో తెలుసా?

వాట్సాప్ గ్రూపుల ద్వారా గంజాయిని సరఫరా చేస్తున్నారని కేసీఆర్ చెప్పారు. డ్రగ్స్ వినియోగం వల్ల మానసిక స్థితి దెబ్బతింటుందని… ఆత్మహత్యలకు కూడా పాల్పడే అవకాశం ఉందని అన్నారు. డ్రగ్స్, గంజాయి వినియోగించే వారు ఎంతటివారైనా ఉపేక్షించొద్దని తేల్చి చెప్పారు. వీటిని నియంత్రించేందుకు డీజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించాలని, ఇంటెలిజెన్స్ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, విద్యాసంస్థల దగ్గర ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని కేసీఆర్ అన్నారు. గుడుంబా, గ్యాంబ్లింగ్ పై దృష్టి పెట్టాలన్న సీఎం కేసీఆర్ గంజాయి రహిత తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.

”ఒక వైపు రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తున్న సందర్భంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయం. ఈ పీడను తొందరగా తొలగించకపోతే మనం సాధిస్తున్న విజయాలు వాటి ఫలితాలు నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉంది. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే విషయాన్ని పోలీస్, ఎక్సైజ్ శాఖాధికారులు తీవ్రంగా పరిగణించాలి. ఎంతో ఆవేదనతో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పెడతోవ పట్టిన యువత గంజాయి గ్రూపులుగా ఏర్పడి వాట్సాప్ మెసెజ్‌ల ద్వారా గంజాయి సేవిస్తున్నారని నివేదికలు వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు” అని కేసీఆర్ అన్నారు.

Rose Tea : బరువును తగ్గించే రోజ్ టీ

ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను బలోపేతం చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను కేసీఆర్ ఆదేశించారు. సరిహద్దుల్లో చెక్ పోస్టుల సంఖ్యను పెంచాలన్నారు. సమాచార వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు తగినన్ని వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇంటెలిజెన్స్ శాఖలో కూడా ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని చెప్పారు.