Delhi : హైదరాబాద్‌కు వచ్చేసిన సీఎం కేసీఆర్

కేంద్ర మంత్రులను ఎవరినీ కలవకుండానే తిరుగుపయనమయ్యారు. అయితే కేటీఆర్‌, ఇతర మంత్రులు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు.

Delhi : హైదరాబాద్‌కు వచ్చేసిన సీఎం కేసీఆర్

Kcr Delhi

CM KCR Delhi Tour : ప్రధాని మోదీని కలవకుండానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చేశారు. వరి ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌ ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురుచూశారు. కేంద్ర మంత్రులను ఎవరినీ కలవకుండానే తిరుగుపయనమయ్యారు. అయితే కేటీఆర్‌, ఇతర మంత్రులు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు.

Read More : Varanasi : వీధుల్లో మహిళ నివాసం..ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్!

2021, నవంబర్ 23వ తేదీ మంగళవారం కేంద్రమంత్రి  పీయూష్ గోయల్, వ్యవసాయ శాఖమంత్రి తోమర్‌తో కేటీఆర్ నేతృత్వంలోని బృందం కలిసింది. వరి ధాన్యం కొనుగోళ్లపై చర్చించింది. పంజాబ్ మాదిరే తెలంగాణ‌లో 90 శాతం వ‌రి ధాన్యాన్ని కోనుగోలు చేయాల‌ని కోరారు. ఏడాదికి ఒకేసారి ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం నిర్దేశించాలని టీఆర్ఎస్ నేతల బృందం కేంద్రమంత్రిని కోరింది.

Read More : Rajasthan : రోడ్లు కత్రినా బుగ్గల్లా ఉండాలి, నెటిజన్ల ఫైర్..వీడియో వైరల్

రెండు సీజన్లలో కలిపి తెలంగాణ నుంచి సుమారు 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని టిఆర్ఎస్ నేతల బృందం కోరారు. ఏ సీజన్‌లో ఎంత ధాన్యం దిగుబడి ఉంటుందో చెప్పాలని కేంద్ర మంత్రులు కోరారు. అయితే మంత్రుల సమావేశంలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 2021, నవంబర్ 25వ తేదీ గురువారం మరోసారి మంత్రులు పీయూష్‌ గోయెల్‌తో సమావేశం కానున్నారు.