CM KCR : నాలుగో రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్

ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్‌ బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ నాలుగో రోజు హస్తినలో కేసీఆర్‌ టూర్‌ కొనసాగనుంది. ఇవాళ్టి పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ కానున్నారు.

CM KCR : నాలుగో రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్

Cm Kcr

CM KCR Delhi Tour : ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్‌ బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ నాలుగో రోజు హస్తినలో కేసీఆర్‌ టూర్‌ కొనసాగనుంది. ఇవాళ్టి పర్యటనలో భాగంగా.. పలువరు కేంద్ర మంత్రులతో భేటీకానున్నారు సీఎం కేసీఆర్‌. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశాలున్నాయి.

సీఎం కేసీఆర్‌ నిన్న ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలంటూ.. పది విజ్ఞప్తులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 8 నెలల తర్వాత ప్రధానితో సమావేశమమైన కేసీఆర్‌.. 50 నిమిషాలపాటు మోదీతో చర్చించారు. ఇందులో ఐపీఎస్‌ల సంఖ్య పెంపు, కొత్తజిల్లాలకు ఐపీఎస్‌ల కేటాయింపు, హైదరాబాద్‌ – నాగ్‌పూర్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద అదనపు నిధులివ్వాలని.. కొత్త జిల్లాలకు జవహర్‌ నవోదయ విద్యాలయాలను కేటాయించాలని మోదీకి విన్నవించారు. తెలంగాణకు గిరిజన వర్సిటీ, హైదరాబాద్‌లో ఐఐఎం, కరీంనగర్‌కు ఐఐటీ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం నుంచి తగిన రీతిలో సహకరించాల్సిందిగా కోరారు సీఎం. ఢిల్లీలో రాష్ట్ర అధికార భవన్.. తెలంగాణ భవన్ నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తికావస్తుండటంతో.. ప్రధాని మోదీని ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సిందిగా, సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఆలయ ప్రారంభోత్సవం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. సీఎం ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ, యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభ మహోత్సవానికి తాను తప్పకుండా హాజరవుతానని స్పష్టమైన హామీ ఇచ్చారు.