CM KCR: మూతికో బట్ట.. ము..కో బట్ట అంటూ మాస్క్ గురించి చెప్పిన సీఎం కేసీఆర్

సిద్దిపేటతోపాటు కామారెడ్డి జిల్లాల్లో పర్యటించిన సీఎం కేసిఆర్.. సమీకృత కలెక్టర్ కార్యాలయాలు, పోలీసు కమిషనరేట్‌ కార్యాలయాలను ప్రారంభించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సైతం మంత్రి హరీష్ రావుతో కలిసి ఆరంభించారు.

CM KCR: మూతికో బట్ట.. ము..కో బట్ట అంటూ మాస్క్ గురించి చెప్పిన సీఎం కేసీఆర్

Cm Kcr Describes About Mask In Funny Way

CM KCR: సిద్దిపేటతోపాటు కామారెడ్డి జిల్లాల్లో పర్యటించిన సీఎం కేసిఆర్.. సమీకృత కలెక్టర్ కార్యాలయాలు, పోలీసు కమిషనరేట్‌ కార్యాలయాలను ప్రారంభించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సైతం మంత్రి హరీష్ రావుతో కలిసి ఆరంభించారు.

ఇందులో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో మరో నాలుగు సూపర్ స్పెషలిటి ఆసుపత్రులు స్టార్ట్ చేయనున్నట్లు.. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులపై పడుతున్న అధిక భారాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

కరోనాతో మరో బాధ వచ్చిపడిందని మూతికో బట్ట, ముడ్డికో బట్ట కట్టుకుని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ గడుపుతున్నారని అన్నారు. మాస్క్‌లతో ఏదైనా కార్యక్రమాలకు వెళితే గుర్తుపట్టేందుకు మాస్క్ తీయమంటున్నరు.. మాస్క్ తీస్తే కరోనా బారిన పడుతున్నం అని.. చివరకు తనకు కూడా అలాగే వచ్చిందని అనడంతో సభలో నవ్వులు పూశాయి.

మరోవైపు హరితహారం, గ్రామాభివృద్దిపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. సిద్దిపేటలో చెట్లు ఎంతో బాగున్నాయి. కొన్నింటిలో మాత్రం ఇబ్బంది ఉంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల పొరబాట్లు జరుగుతున్నాయి. అటువంటి అధికారులు ఎవరైనా కనిపిస్తే.. దొరకబట్టి బండకు కొట్టుర్రి అన్నారు.

సిద్దిపేట జిల్లాలోనే పుట్టి పెరిగారని.. తాను పుట్టిపెరిగిన సిద్దిపేటలో తొలి కలెక్టరేట్‌ సముదాయం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.