CM KCR : ఎవరు ఇన్? ఎవరు ఔట్? సీఎం కేసీఆర్‌ చేతిలో సర్వే నివేదిక, ఎమ్మెల్యేలలో టెన్షన్

2023 అసెంబ్లీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న గులాబీ బాస్.. ఎన్నికలకు ఇంకా టైమ్ ఉన్నా, ఇప్పటి నుంచే యాక్షన్ షురూ చేశారు.

CM KCR : ఎవరు ఇన్? ఎవరు ఔట్? సీఎం కేసీఆర్‌ చేతిలో సర్వే నివేదిక, ఎమ్మెల్యేలలో టెన్షన్

CM KCR : 2023 అసెంబ్లీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న గులాబీ బాస్.. ఎన్నికలకు ఇంకా టైమ్ ఉన్నా, ఇప్పటి నుంచే యాక్షన్ షురూ చేశారు.

మునుగోడు నియోజకవర్గంలో గెలిచినా, అక్కడ ఎదురైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అన్ని నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పరిస్థితిపై ఆరా తీసిన కేసీఆర్.. ఇప్పటినుంచే పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో నివేదికలు సిద్ధం చేసిన గులాబీ బాస్.. 119 నియోజకవర్గాలను మూడు భాగాలుగా విభజించారు. వాటిలో కచ్చితంగా విజయం సాధించేవి 40 ఉండగా, కొంచెం కష్టపడితే గెలిచే నియోజకవర్గాలు 30 నుంచి 35 వరకు ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు వీక్ గా ఉన్నట్లు నివేదికలు అందాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

దీంతో బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో విజయం కోసం ఇప్పటి నుంచే కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బలహీనంగా ఉన్న స్థానాల్లో విజయం కోసం ఇప్పటి నుంచే కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బలహీనంగా ఉన్న చోట ప్రత్యేక దృష్టి పెట్టేలా మంత్రులు, కీలక నేతలకు బాధ్యతలు అప్పగించబోతున్నారు. త్వరలోనే ఇంచార్జిలను నియమించనున్నారు కేసీఆర్.