CM KCR: మహారాష్ట్రకు నేడు సీఎం కేసీఆర్.. నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ.. భారీగా చేరికలు

బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై కసరత్తును ముమ్మరంచేసిన సీఎం కేసీఆర్ తొలుత తెలంగాణ సరిహద్దులోఉన్న మహారాష్ట్రలోని ప్రాంతాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాందేడ్ జిల్లా కేంద్రంలో నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

CM KCR: మహారాష్ట్రకు నేడు సీఎం కేసీఆర్.. నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ.. భారీగా చేరికలు

BRS Party

CM KCR: దేశ వ్యాప్తంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని వేగంగా విస్తరించేందుకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, తమిళనాడు మాజీ సీఎంతో పాటు పలు రాష్ట్రాల నేతలు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలోసైతం వారు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంకు ఆనుకొని ఉన్న మహారాష్ట్రపై బీఆర్ఎస్ అధినేత తాజాగా ఫోకస్ పెట్టారు. ఆ రాష్ట్రంలో భారీ బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ జెండాను పాతేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని చెన్నూరు నుంచి బోధన్ నియోజకవర్గాల ఊళ్లకు.. మహారాష్ట్రంలోని 976 కిలో మీటర్ల మేర సరిహద్దు గ్రామాలు ఉన్నాయి. ఇరు ప్రాంతాల ప్రజలు నిత్యం వ్యాపార, ఉపాధి, బంధుత్వ అవసరాలతో రాకపోకలు సాగిస్తుంటారు. నాందేడ్ జిల్లా తెలంగాణ సరిహద్దు జిల్లా కావటం, గతంలో సరిహద్దు ప్రాంతాలకు చెందిన పలు పార్టీల నేతలు తమను తెలంగాణలో కలపాలని కోరుతూ కేసీఆర్‌కు విన్నివించిన విషయం విధితమే.

BRS: తెలంగాణ దాటి విస్తరిస్తున్న బీఆర్ఎస్.. ఛత్తీస్‭గఢ్‭లో ‘చెయ్యి’ అందిచనున్న కీలక నేత!

బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై కసరత్తును ముమ్మరంచేసిన సీఎం కేసీఆర్ తొలుత తెలంగాణ సరిహద్దులోఉన్న మహారాష్ట్రలోని ప్రాంతాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాందేడ్ జిల్లా కేంద్రంలో నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే సభ విజయవంతంకోసం ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ కీలక నేతలు మహారాష్ట్రలో తెలుగు ప్రజలు నివస్తున్న గ్రామాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలవుతున్న పథకాలను వివరిస్తూ, బీఆర్ఎస్ కు మద్దతుగా నిలవాలని, సభను విజయవంతం చేయాలని కోరారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి భారీ చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే తెలంగాణ రాష్ట్రం బయట బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన తొలి సభ ఇదే కావటం గమనార్హం.

 

సీఎం కేసీఆర్ నాందేడ్ పర్యటన ఇలా..

– సీఎం కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు నాందేడ్ విమానాశ్రయానికి చేరుకుంటారు.

– అక్కడి నుంచి ఛత్రపతి శివాజీ విగ్రహం వద్దకు చేరుకొని నివాళులర్పిస్తారు. ఆ తరువాత చారిత్రక గురుద్వారాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

– మధ్యాహ్నం 1.30 గంటలకు బహిరంగ సభాస్థలి వద్దకు చేరుకుంటారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు.

– నాదేండ్ జిల్లా కేంద్రంలో జరిగే సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.

– 2.30 గంటలకు స్థానిక సిటీ ఫ్రైడ్ హోటల్ కు చేరుకుంటారు.

– 4గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడతారు. అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.