KCR Good News : ఆ ఉద్యోగులకు.. సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్

ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని చెప్పారు.(KCR Good News)

KCR Good News : ఆ ఉద్యోగులకు.. సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్

Kcr Delhi

KCR Good News : రాష్ట్రంలోని ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ప్‌, మెప్మా ఉద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. సమ్మె బాట పట్టి ఉద్యోగాల నుంచి ఉద్వాసనకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు ప్రకటించారు. అయితే, గతంలో చేసిన తప్పు మళ్లీ చేయొద్దని సున్నితంగా హెచ్చరించారు. సమ్మెలు అంటూ పొరపాటు చేయొద్దని సూచించారు. అలాగే సెర్ప్, ఐకేసీ, మెప్మా ఉద్యోగులకూ సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ అనంత‌రం కేసీఆర్ కీలక ప్రకటనలు చేశారు.

సెర్ప్ లో 4వేల 500 మంది పని చేస్తున్నారు. సెర్ప్ సొసైటీ.. ప్రభుత్వ ఉద్యోగులు కాదు. అయినప్పటికీ మహిళా సంఘాలను చైతన్యం చేసేందుకు, ఆర్గనైజింగ్‌ కెపాసిటీ పెంచేందుకు విశేష కృషి చేస్తున్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయి. సెర్ప్ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తాం.

ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ అని చెప్పి ఉపాధిహామీలో పని చేస్తారు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ఓ భ్రమలో సమ్మెకు వెళ్లారు. సమ్మె వద్దని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి, సంబంధిత శాఖ అధికారులు చెప్పినా వినకుండా వెళ్లారు. ఇప్పుడు తప్పయిందని అక్కడికి ఇక్కడి తిరుగుతున్నరు. వాళ్లపై మాకేం కోపం లేదు. ఆ అవసరం లేదు. వారికి పెద్దన్నలా హెచ్చరిస్తున్నా.. ఇకపై పొరపాట్లు పునరావృతం చేయొద్దు. మానవతా దృక్పథంతో మళ్లీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటాం. వాళ్లు పొరపాటు చేశారు.. పెద్ద మనసుతో వాళ్లను క్షమించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఇకపై మళ్లీ ఆ తప్పుమని చేయమని చెప్పారు. అందరి మాటనే నా మాట.. వారందరిని విధుల్లోకి తిరిగి తీసుకుంటాం’ అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.(KCR Good News)

విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్(వీఆర్‌ఏల) విధులపైనా కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ కింద పనిచేస్తున్న వీఆర్ఏలను ఇక నుంచి ఇరిగేషన్ శాఖలో కలపనున్నట్లు చెప్పారు. వీఆర్ఏలను లష్కర్ పోస్టులకు తీసుకుంటామని.. వారికి పే స్కేల్ అమలు చేస్తామని వెల్లడించారు. వీఆర్ఏలలో చాలా మంది ఉన్నత చదువులు చదివిన వారున్నారని.. వారందరికీ ప్రమోషన్లు ఇస్తామన్నారు.

CM KCR: నిపుణుల రిపోర్ట్ రాగానే.. 111 జీవోను ఎత్తేస్తాం: సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

యుక్రెయిన్ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన మెడిసిన్ విద్యార్ధులకు సైతం సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. వారు ఎంబీబీఎస్ చదివేందుకు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని ప్రకటించారు సీఎం. ఎక్స్ పర్ట్స్ కమిటీ నివేదిక రాగానే 111 జీవో ఎత్తేస్తామని సీఎం చెప్పారు.

”భారత్ లో మెడిసిన్ కు కోటి రూపాయలు ఖర్చవుతుందంటున్నారు. అదే సమయంలో ఉక్రెయిన్ లో రూ.25 లక్షలతోనే వైద్య విద్య పూర్తి చేయొచ్చని చెబుతున్నారు. భారత్ లో అధిక మొత్తాలు చెల్లించలేక ఉక్రెయిన్ వెళితే అక్కడ ప్రస్తుత పరిస్థితులేం బాగోలేవు. ఉక్రెయిన్ మళ్లీ ఎప్పటికి సాధారణ స్థితికి చేరుకుంటుందో చెప్పలేం. అందుకే 740 మంది తెలంగాణ విద్యార్థులు ఇక్కడే వైద్య విద్య పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. వారి చదువుకయ్యే అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాం. వారి చదువు దెబ్బతినకూడదన్నదే మా ఆలోచన” అని కేసీఆర్ స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం విధానాలను తప్పుపట్టారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందని, కోట్ల మంది పేదరికంలోకి వెళ్లారని, జీడీపీ తగ్గిందని, పరిశ్రమలు మూతపడ్డాయని కేసీఆర్ వాపోయారు. దేశం ఆత్మ నిబ్బరం కోల్పోతోందన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో ఏదైనా పెంచింది అందంటే.. అది మత పిచ్చి మాత్రమే అన్నారు.