రైతు వేదిక రెడీ, కొడకండ్లకు సీఎం కేసీఆర్

  • Published By: madhu ,Published On : October 31, 2020 / 06:35 AM IST
రైతు వేదిక రెడీ, కొడకండ్లకు సీఎం కేసీఆర్

CM KCR Inaugurate Rythu Vedika : రైతులను సంఘటితం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో వేదికను సిద్ధం చేస్తోంది. గ్రామస్థాయిలో రైతులందరినీ ఒకే చోటకు చేర్చేందుకు…గ్రామ రైతు వేదికలను అందుబాటులోకి తీసుకువస్తోంది. జనగామ జిల్లా కొడకండ్లలో తొలి రైతు వేదికను 2020, అక్టోబర్ 31వ తేదీ శనివారం ప్రారంభించబోతున్నారు సీఎం కేసీఆర్.




అన్నదాతల కోసం :-
అన్నదాతల కోసం రైతు బంధు, రైతు బీమా, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను తీసుకువచ్చారు సీఎం కేసీఆర్‌. ఇపుడు రైతుల కోసం గ్రామస్థాయిలో రైతు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ఏడాది క్రితం ఈ పనులు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల 604 రైతు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటవుతున్న ఒక్కో రైతు వేదిక నిర్మాణం కోసం 22 లక్షల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇప్పటికే 90 శాతానికి పైగా వేదికల నిర్మాణం పూర్తయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు వివరించేందుకు వీలుగా రైతు వేదికల్లో ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.
https://10tv.in/cm-kcr-to-address-on-dharani-portal-2/
కొడకండ్లలో తొలి రైతు వేదిక :-
జనగామ జిల్లా కొడకండ్లలో తొలి రైతువేదికను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ప్రకృతి వనం పనులను పరిశీలిస్తారు. రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. గ్రామస్థాయిలో రైతు బంధు సమితులను కీలకం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న వ్యవసాయం, రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు ఈ వేదిక ద్వారా పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపట్టనుంది.

<


span style=”color: #ff0000;”>రైతులకు సూచనలు :-
సీజన్లకు అనుగుణంగా రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. నియంత్రిత పంటల సాగువిధానం అమలుపై కూడా ఈ వేదికలపైనే చర్చలు జరుగనున్నాయి. నెల రోజుల్లోగా కొత్తగా నిర్మించిన రైతు వేదికలన్నింటినీ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.