CM KCR Launch 8 medical colleges : 8 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం .. తెలంగాణలో చరిత్రలో కొత్త అధ్యాయం : సీఎం కేసీఆర్

తెలంగాణలో కొత్తగా నిర్మించిన 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ఈరోజు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రగతి భవన్ నుంచి వర్చువల్ గా ఎనిమిది మెడికల్ కాలేజీలకు ప్రారంభించారు కేసీఆర్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణలో చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయం అని..తెలంగాణలో 1,180 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

CM KCR Launch 8 medical colleges : 8 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం .. తెలంగాణలో చరిత్రలో కొత్త అధ్యాయం : సీఎం కేసీఆర్

CM KCR inaugurated 8 medical colleges _

CM KCR will launch 8 medical colleges : తెలంగాణలో కొత్తగా నిర్మించిన 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ఈరోజు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రగతి భవన్ నుంచి వర్చువల్ గా ఎనిమిది మెడికల్ కాలేజీలకు ప్రారంభించారు కేసీఆర్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణలో చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయం అని..తెలంగాణలో 1,180 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

జగిత్యాల, రామగుండం, కొత్తగూడెం, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, వనపర్తి, మహబూబాబాద్ లో మెడికల్ కాలేజీలను కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది.వీటిని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మారుమూల ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయని ఎవ్వరూ ఊహించని విధంగా వాటిని నిర్మించామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయం అని..ఈ మెడికల్ కాలేజీల నిర్మాణానికి అందుబాటులోకి తీసుకురావటానికి మంత్రి హరీశ్ రావు ఎంతో కృష్టి చేశారని కొనియాడారు. కొత్తగా నిర్మించిన ఈ ఎనిమిది కాలేజీలతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యలు 2,790కి పెరిగిందని తెలిపారు. పీజీ సీట్లు కూడా 1,180కి పెరిగాయని..ఇటువంటి అభివృద్దితో దూసుకుపోతున్న తెలంగాణ దేశానికి ఆదర్శవంతంగా మారుతోందన్నారు.

కాగా..తెలంగాణలో పెద్ద సంఖ్యలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం కృష్టికి ఫలితంగా సీఎం కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. జగిత్యాల, రామగుండం, కొత్తగూడెం, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, వనపర్తి, మహబూబాబాద్ లో మెడికల్ కాలేజీలను నిర్మించిన సంగతి తెలిసిందే. వీటిని సీఎం కేసీఆర్ వర్చువల్ గా ప్రారంభించారు. కాగా..గత 8 ఏళ్లలోనే 12 కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని మరింతగా పెంచటానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. దీంట్లో భాగంగానే వచ్చే ఏడాది 9, పైఏడాది మరో 8 కాలేజీల ఏర్పాటు చేసే యోచనలో ఉంది ప్రభుత్వం. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకో మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం సంకల్పించింది.