ప్రపంచ పోరాటాల చరిత్రలోనే భారత స్వాతంత్ర్య పోరాటం ప్రత్యేకమైనది : సీఎం కేసీఆర్

ప్రపంచ పోరాటాల చరిత్రలోనే భారత స్వాతంత్ర్య పోరాటం ప్రత్యేకమైనదని సీఎం కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర్యం కోసం గాంధీజీ అహింసా మార్గం ఎంచుకున్నారని తెలిపారు. తెలంగాణలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

ప్రపంచ పోరాటాల చరిత్రలోనే భారత స్వాతంత్ర్య పోరాటం ప్రత్యేకమైనది : సీఎం కేసీఆర్

Cm Kcr Inaugurated The Azadi Ka Amrit Mahotsav Program

Azadi Ka Amrit Mahotsav program : ప్రపంచ పోరాటాల చరిత్రలోనే భారత స్వాతంత్ర్య పోరాటం ప్రత్యేకమైనదని సీఎం కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర్యం కోసం గాంధీజీ అహింసా మార్గం ఎంచుకున్నారని తెలిపారు. తెలంగాణలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ గాంధీజీ సిద్ధాంతాలు యావత్ ప్రపంచానికి స్ఫూర్తి దాయకం అన్నారు.

యావత్ భారతజాతి స్వాతంత్ర్య అమృత ఉత్సవాలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. అమృత మహోత్సవానికి దండియాత్రే స్ఫూర్తి అన్నారు. ఉప్పు సంత్యాగ్రహంలో హైదరాబాద్ ముద్దుబిడ్డ సరోజినీ నాయుడు పాల్గొన్నారని గుర్తు చేశారు. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించామని కేసీఆర్ తెలిపారు.

తెలంగాణ ఉద్యమానికి గాంధీ చూపిన దారే స్ఫూర్తి అన్నారు. ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. 75 వారాల పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. నాటి స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి నేటి తరంలో నింపాలన్నదే కార్యక్రమ లక్ష్యం అన్నారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ఆగస్టు 15 వరకు కొనసాగునున్నాయి. ఈ మహోత్సవ్ నిర్వహణకు రూ.25 కోట్లు కేటాయించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలకు హైదరాబాద్, వరంగల్ ముస్తాబు అయింది.