CM KCR. : కరవు తాండవించే జనగామ ఇప్పుడు అభివృద్ధి చెందింది : సీఎం కేసీఆర్

కరవు తాండవించే జనగామ ఇప్పుడు అభివృద్ధి చెందింది అని జనగామ కలెక్టరేట్ ను ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు.

CM KCR. : కరవు తాండవించే జనగామ ఇప్పుడు అభివృద్ధి చెందింది : సీఎం కేసీఆర్

Cm Kcr Janagama Collectorate Inaugurated

CM KCR jangaon Collectorate inaugurated : జనగామ కలెక్టరేట్ సముద్రాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.అనంతరం సీఎం మాట్లాడుతూ.. అద్భుతమైన సౌకర్యాలతో జనగామలో కలెక్టరేట్ ను నిర్మించుకున్నామని తెలిపారు. జనగామ ఒకప్పుడు ఎండిపోయి మోడుబారిపోయి కనిపించేదని ఇప్పుడు కళకళలాడుతోందని తెలిపారు. తెలంగాణ ఏర్పరచుకుని..టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జనగామ రూపు రేఖలు మారిపోయాయని అన్నారు.ప్రొఫెసర్ జయశంకర్ జీవించి ఉణ్నప్పుడు జనగామను తలచుకుని ఎంతో బాధపడేవారని గుర్తు చేసుకున్నారు కేసీఆర్. ఏడేళ్ల క్రితం జనగామ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మనందరికి తెలుసని..ఒకప్పుడు నీళ్ల కోసం మహిళలు మైళ్లకొద్దీ దూరం నడిచివెళ్లేమారిని ఇప్పుడు ఇంటికే నీళ్లు వస్తున్నాయని తెలిపారు.

Also read : Indonesia crocodile : మొనగాడొచ్చాడు..13 అడుగుల మొసలి మెడలో టైర్ తీసాడు..రూ.కోట్ల బహుమతిని ఏంచేశాడంటే..

ఒకప్పుడు జనగామలో కరవు పరిస్థితులు ఉండేవని ఆనాటి కరవు పరిస్థితులను చూసి బచ్చన్నపేటలో నేనే ఏడ్చాశానని..కానీ రాష్ట్రం ఏర్పడ్డాక..చక్కటి ప్రణాళికలవు వేసుకుని పరిస్థితులను మార్చుకున్నామని దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసుకుని నీటి సమస్యలను అధిగమించామని తెలిపారు. ఒకప్పుడు ఎన్ని ఎకరాల భూమి ఉన్న పండే పరిస్థితి లేదు.కానీ ఇప్పుడు మూడు ఎకరాల భూమి ఉన్న రైతు కోటీశ్వుడు అని అన్నారు. భారతదేశంలో అవార్డులు పొందిన గ్రామాల్లో 10 గ్రామాలు తెలంగాణలోవేనని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు.

Also read : Health Tips: ఆహారంలో మార్పులు చేసుకుంటే..జీవిత కాలంకంటే మరో 13 ఏళ్లు ఎక్కువే బతకొచ్చు: పరిశోధనల్లో వెల్లడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి గానీ వరంగల్ జిల్లాకు గాని కరవు పరిస్థితి అనేదే లేదని అన్నారు.కరెంట్ పోయింది అనేమాటే లేదన్నారు. 2601 రైతు వేదికలు కట్టించిన ఘతన తెలంగాణ ప్రభుత్వానిదని కేసీఆర్ వెల్లడించారు.