CM KCR : యాదాద్రిలో ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

తూర్పు దిశలో తొమ్మిది విల్లాలు, ఉత్తర దిశలో ఐదు విల్లాలను నిర్మించారు. ప్రెసిడెన్షియల్ సూటుకు వెళ్లే మార్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

CM KCR : యాదాద్రిలో ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

Kcr (5)

CM KCR Yadadri Tour : యాదాద్రి పునర్‌ నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వీవీఐపీల బస కోసం నిర్మించిన 15 విల్లాలతో కూడిన ప్రెసిడెన్షియల్ సూట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అధునాతన పద్ధతిలో నిర్మించిన ఈ అతిధి గృహాల్ని… కేసీఆర్‌ రిబ్బన్‌ కట్‌ చేసి అందుబాటులోకి తెచ్చారు. వీటిని ముందుగా దాతల విడిదికి కేటాయించనున్నారు. అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు కేసీఆర్‌. సాయంత్రం రాయగిరిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.

ప్రముఖ పుణ్యక్షేత్రంగా రూపొందుతున్న యాదాద్రిలో వీవీఐపీల విడిది కోసం అధునాతనంగా, సంప్రదాయ రీతిలో ప్రెసిడెన్షియల్ సూట్లు, విల్లాలు నిర్మించారు. యాదాద్రీశుడు కొలువైన కొండ కింద ఉత్తర దిశలోని చిన్నకొండపై ఈ 14 విల్లాలు, ఒక ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మించారు. 13 ఎకరాల విస్తీర్ణంలో ఈ గృహాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక సదుపాయాలతో ప్రెసిడెన్షియల్ సూట్‌ను నిర్మించారు.

Statue of Equality : విష్ణు సహస్ర నామ పారాయణంతో మారుమ్రోగిన ముచ్చింతల్

తూర్పు దిశలో తొమ్మిది విల్లాలు, ఉత్తర దిశలో ఐదు విల్లాలను నిర్మించారు. ప్రెసిడెన్షియల్ సూటుకు వెళ్లే మార్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయాన్ని తిలకించేందుకు వ్యూ పాయింట్, డైనింగ్ హాల్, అధునాతనంగా ఎనోక్లోజర్ అద్దాలు, సెంట్రల్ ఏసీ సదుపాయాలతో ఉంటుంది ఈ సూట్‌. ఆ గృహాల నిర్మాణంతో పాటు ఇతర సదుపాయాల కోసం దాదాపు 143 కోట్లు ఖర్చు చేశారు.