CM KCR : 6.10 ఎకరాల్లో రూ.12 కోట్లతో బ్రాహ్మణ సదన్ ప్రారంభించిన సీఎం కేసీఆర్

బ్రాహ్మణుల్లో కూడా చాలామంది పేదలున్నారని వారి సంక్షేమం కోసం ప్రతీ ఏటా నిధులు కేటాయిస్తున్నామని CM KCr తెలిపారు. బ్రాహ్మణ పరిషత్ కు ఏటా రూ.100కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.

CM KCR – Brahmana Sadan : హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి (Serilingampally) మండలం గోపన్నపల్లి (Gopanpally)లో బ్రాహ్మణ సదనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 6.10 ఎకరాల విస్తీర్ణంలో రూ.12 కోట్ల వ్యయంతో విప్ర‌హిత బ్రాహ్మ‌ణ సంక్షేమ స‌ద‌నాన్ని (Brahmana Samkshema Sadan) సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తు.. బ్రాహ్మణుల్లో కూడా చాలా మంది పేదలున్నారని వారి సంక్షేమం కోసం ప్రతీ ఏటా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. బ్రాహ్మణ పరిషత్ కు ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. విప్రహిత బ్రాహ్మణ సదన్ భవనాన్ని రూ.12కోట్లతో నిర్మించామని తెలిపారు. బ్రాహ్మణ సదనం భవన ప్రారంభం కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రి స‌బితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు పీఠాధిపతులు, పండితులు పాల్గొన్నారు.

కాగా రంగారెడ్డి పరిధిలోకి వచ్చే శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామంలో బ్రాహ్మణ సదన్ భవనం నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 6.10 ఎకరాలను కేటాయించింది. ఇందులో బ్రాహ్మణ సమాజ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 12 నిర్మాణాలు చేపట్టారు. 2017లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బ్రాహ్మణ సదన్ భవన ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. మూడు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనంలో కల్యాణ మండపం, సమాచార కేంద్రం, పీఠాధిపతుల, ధర్మాచార్యుల సదనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ భవనంలో ఆధ్యాత్మిక గ్రంధాలు, వేదాలు, ఆధ్యాత్మిక సాహిత్యాలు వంటివి అందుబాటులోకి రానున్నాయి.

Also Read: ఇది కల కాదు కదా..? శుభకార్యంలో పాల్గొని మాట్లాడుకున్న బండి సంజయ్, కల్వకుంట్ల కవిత.. ఏం జరిగిందంటే?

 

ట్రెండింగ్ వార్తలు