CM KCR : కొత్త సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నూతన సచివాలయం నిర్మాణ ప్రాంతానికి సీఎం కేసీఆర్ వెళ్లారు. నిర్మాణ పనులు ఏ రకంగా జరుగుతున్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు

CM KCR : కొత్త సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

Cm Kcr (1)

Construction of the new Secretariat : తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇవాళ కొత్త సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. కొత్త సచివాలయం నిర్మాణ ప్రాంతానికి సీఎం వెళ్లారు. నిర్మాణ పనులు ఏ రకంగా జరుగుతున్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లారు. మసీదు, గుడి నిర్మాణ పనులను పరిశీలించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ ఉన్నారు.

ఇంతకముందు ఆగస్టు 7న సీఎం కేసీఆర్…సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. రెండు సంవత్సరాల క్రితం కొత్త సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ కరోనా నేపథ్యంలో పనులు నిలిచిపోయాయి. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. సచివాలయ 6వ అంతస్తు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 2022 అక్టోబర్ దసరా నాటికి సచివాలయ నిర్మాణ పనులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. అందుకనుగుణంగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

Cannabis Smuggling : రైలు ఏసీ బోగీల్లో రూ.3 కోట్ల విలువైన గంజాయి తరలింపు

ఆగస్టులో నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ కొన్ని సూచనలు చేశారు. సచివాలయ నిర్మాణ విషయంలో ఎలాంటి అశ్రద్ధ వహించకూడదని..నిర్దేశించిన సమయం ప్రకారం పనులు నిర్వహించాలన్నారు. కరోనాతో కొంత ఇబ్బంది అయినా..వచ్చే ఏడాదికి మాత్రం కొత్త సచివాలయాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ సూచించారు.

ప్రజలకు అందిస్తున్న మెరుగైన పాలనకు అనుగుణంగా సచివాలయం కూడా అందుబాటులోకి రావాలని సీఎం కేసీఆర్ తెలిపారు. వసతులు, నిర్మాణ విషయంలో ఎలాంటి ఆలస్యం జరగవద్దని ఆదేశించారు. నూతన సచివాలయ నిర్మాణ పనులకు సంబంధించి.. ప్రగతి భవన్ లో ఆర్ అండ్ బీ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డితోపాటు ఇతర మంత్రులతో సీఎం చర్చించారు. సచివాలయ నిర్మాణ పనులను శాపూర్ జీ-పల్లోంజీ సంస్థ చేపట్టిన సంగతి తెలిసిందే.