CM KCR: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత.. ఢిల్లీలోని నివాసంలో చికిత్స

తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఢిల్లీలో ఉన్న ఆయన ప్రస్తుతం తుగ్లక్ రోడ్డులోని నివాసంలో వైద్యులతో చికిత్స చేయించుకుంటున్నారు. తెలంగాణ ఉన్నతాధికారులను అత్యవసరంగా ఢిల్లీ రావాలని ఆదేశించారు.

CM KCR: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత.. ఢిల్లీలోని నివాసంలో చికిత్స

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్ దాదాపు మూడు రోజుల నుంచి స్వల్ప అస్వస్థతతో ఉన్నట్లు సమాచారం. దీంతో తుగ్లక్ రోడ్డులోని తన నివాసంలోనే చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులను ఇంటికి పిలిపించుకుని, కేసీఆర్ ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నారు.

Pawan Kalyan: జనసేన కార్యకర్తలపై కేసులు అక్రమం.. గొడవలు వైసీపీ పనే: పవన్ కల్యాణ్

మరో రెండు, మూడు రోజులపాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉన్నతాధికారులు అత్యవసరంగా ఢిల్లీ రావాలని కేసీఆర్ ఆదేశించారు. దీంతో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ అరవింద్ కుమార్‌తోపాటు ఉన్నతాధికారులు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో అధికారులతో రాష్ట్రానికి సంబంధించి పాలనాపరమైన అంశాలపై కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. అలాగే తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రాన్ని అడిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.