CM KCR : అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. 91,142 ఉద్యోగ పోస్టుల భర్తీ, 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్

80,039 ఉద్యోగాలకు తక్షణం సంబంధిత శాఖల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నామని తెలిపారు. పోలీసు శాఖలో 13,334 ఉద్యోగ ఖాళీలు, విద్యాశాఖలో 13,086 ఖాళీలు ఉన్నాయని తెలిపారు.

CM KCR : అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. 91,142 ఉద్యోగ పోస్టుల భర్తీ, 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్

Cm Kcr (1)

job replacement : ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 91, 142 ఉద్యోగాల పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే నోటిఫికేషన్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేస్తున్నామని చెప్పారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

80,039 ఉద్యోగాలకు తక్షణం సంబంధిత శాఖల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నామని తెలిపారు. పోలీసు శాఖలో 13,334 ఉద్యోగ ఖాళీలు, విద్యాశాఖలో 13,086 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

CM KCR : తెలంగాణ భాష పెడితే సినిమాలు హిట్ : సీఎం కేసీఆర్

జిల్లా స్థాయిలో 39, 829 ఉద్యోగ ఖాళీలు, జోనల్ స్థాయిలో 18,866 ఉద్యోగ ఖాళీలు, మల్టీ జోన్ లో 13,170 ఉద్యోగ ఖాళీలు, ఇతర కేటగిరిచ, వర్సిటీల్లో 8,174 పోస్టులు, గ్రూప్1-503, గ్రూప్ 2-582 పోస్టులు, గ్రూప్3 -1373 పోస్టులు, గ్రూప్ 4-9168 పోస్టులు ఉన్నట్లు తెలిపారు. ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసు శాఖ మినహా మిగిలిన ఉద్యోగాలకు వయోపరిమితి పదేళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.