CM KCR: నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. భారీ బహిరంగ సభ.. షెడ్యూల్ ఇలా..

సీఎం కేసీఆర్ కొత్త కలెక్టరేట్ ఆవరణలోని హెలిప్యాడ్‌లో సాయంత్రం 4గంటలకు దిగుతారు. అక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంకు చేరుకొని కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

CM KCR: నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. భారీ బహిరంగ సభ.. షెడ్యూల్ ఇలా..

CM KCR

Nagarkurnool : తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) జిల్లాల పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో అప్పటి వరకు అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లాల వారిగా పర్యటనలకు వెళ్తున్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా (Nirmal District) లో పర్యటించి అక్కడి బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం.. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో రూ. 52 కోట్లతో నిర్మించిన ఆధునిక సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని, రూ. 35 కోట్లతో నిర్మించిన పోలీస్ భవన సముదాయం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ  (BRS Party) జిల్లా కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభిస్తారు.

CM KCR : తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడం నా అదృష్టం : సీఎం కేసీఆర్

నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ మంగళవారం (ఇవాళ) సాయంత్రం జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. జిల్లా కేంద్రం సమీపంలోని వెలమ ఫంక్షన్ హాల్ పక్కన 40 ఎకరాల్లో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలను, బీఆర్ఎస్ కార్యకర్తలను తరలించేలా ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా నాగర్ కర్నూల్ పట్టణంతో పాటు కొల్లాపూర్ చౌరస్తా వరకు నాలుగు కిలో మీటర్ల పొడవునా గులాబీమయమైంది. కేసీఆర్ ప్రారంభించనున్న బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ భవన సముదాయం, ఎస్పీ కార్యాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. మంత్రి నిరంజన్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిలు సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

KTR: ఐటీ శాఖ ప్రగతి నివేదిక విడుదల చేసిన కేటీఆర్.. అప్పట్లో అనేకమంది ఆశ్చర్యంగా చూశారని కామెంట్స్

సీఎం కేసీఆర్ కొత్త కలెక్టరేట్ ఆవరణలోని హెలిప్యాడ్ లో సాయంత్రం 4గంటలకు దిగుతారు. అక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంకు చేరుకొని కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి ప్రారంభిస్తారు. ఆ తరువాత కొత్త కలెక్టరేట్ కు చేరుకొని కలెక్టరేట్ తో పాటు వైద్య కళాశాల శిలాఫలకాన్ని ప్రారంభిస్తారు. అక్కడే కొద్దిసేపు ఎమ్మెల్యేలు, అధికారులతో జిల్లాలో అభివృద్ధి పనులపై సమీక్ష చేస్తారు. సాయంత్రం 6గంటలకు బహిరంగ సభా స్థలికి చేరుకొని ప్రసంగిస్తారు. సభ ముగిసిన అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్ కు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.