CM KCR: నేను ఆనాడే ఈ విషయం చెప్పాను.. అదే జరుగుతోంది: సీఎం కేసీఆర్

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని తాను ఆనాడే చెప్పానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రాలను తలదన్నేలా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. జగిత్యాల పర్యటలో ఉన్న కేసీఆర్ ఇవాళ నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

CM KCR: నేను ఆనాడే ఈ విషయం చెప్పాను.. అదే జరుగుతోంది: సీఎం కేసీఆర్

CM KCR: ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని తాను ఆనాడే చెప్పానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రాలను తలదన్నేలా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. జగిత్యాల పర్యటలో ఉన్న కేసీఆర్ ఇవాళ నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

తెలంగాణ ఏర్పడినప్పుడు తొలి బడ్జెట్ రూ.60 వేల కోట్లని కేసీఆర్ అన్నారు. ఈ ఏడాది తెలంగాణ బడ్జెట్ రూ.2.2 లక్షల కోట్లు దాటి పోతుందని చెప్పారు. గురుకుల విద్యలో తెలంగాణకు తెలంగాణనే సాటిగా నిలిచిందని అన్నారు. అన్ని వర్గాల వారికీ ప్రయోజనాలు అందేలా రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

తెలంగాణ ఏర్పడిన సమయంలో చాలా అనిశ్చిత పరిస్థితి ఉండేదని తెలిపారు. తాము అన్నీ అర్థం చేసుకుని, అన్ని విషయాలపై అంచనాలు వేసుకున్నామని చెప్పారు. 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ మాత్రమే ఉందని అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నప్పటికీ భారీ సంఖ్యలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. రైతు బంధు అందరికీ ఎందుకని కొందరు అంటున్నారని చెప్పారు.

Vikarabad: పంట పొలాల్లో వింత శకటం ప్రత్యక్షం.. వీడిన మిస్టరీ