TS Politics : హ్యాట్రిక్ కొట్టేందుకు పక్కా ప్లాన్ మీదున్న సీఎం కేసీఆర్..ఎంపీ స్థానాల పెంపుపై కసరత్తులు..

తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టేందుకు.. కేసీఆర్ పెద్ద ప్లానే వేసుకున్నారు. దానికి తగ్గట్లుగా.. వ్యూహాన్ని రచించుకున్నారు. ఇప్పటికే.. దాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. ఈసారి.. సర్కారు వారి పాట.. 90కి తగ్గకుండా ఉంటుందని.. ఎప్పుడో ప్రకటించేశారు గులాబీ దళపతి. అయితే.. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ కీ రోల్ పోషించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు కేసీఆర్.

TS Politics : హ్యాట్రిక్ కొట్టేందుకు పక్కా ప్లాన్ మీదున్న సీఎం కేసీఆర్..ఎంపీ స్థానాల పెంపుపై కసరత్తులు..

Cm Kcr Plans In Mp Election

CM KCR plans in MP election : అధికారం చేపట్టిన పార్టీ.. ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ.. మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ.. అధికారంలోకి రావాలంటే.. ఏం చేయాలి? ఎంత ముందు చూపుండాలి? చాలా ఉండాలి. ఎంతంటే.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చే ఎంపీ ఎన్నికలకు.. రెండున్నరేళ్ల ముందే అభ్యర్థులను ఫిక్స్ చేసేంత ముందు చూపు. సర్వే రిపోర్టులను, అభిప్రాయాలను లెక్కలేసుకొని.. కొందరు నాయకులను పార్లమెంట్‌కు ప్రమోట్ చేయాలని డిసైడ్ అయ్యారట గులాబీ బాస్ కేసీఆర్. అందులో భాగంగానే.. కొందరికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారనే టాక్ వినిపిస్తోంది.

తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టేందుకు.. కేసీఆర్ పెద్ద ప్లానే వేసుకున్నారు. దానికి తగ్గట్లుగా.. వ్యూహాన్ని రచించుకున్నారు. ఇప్పటికే.. దాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. ఈసారి.. సర్కారు వారి పాట.. 90కి తగ్గకుండా ఉంటుందని.. ఎప్పుడో ప్రకటించేశారు గులాబీ దళపతి. అయితే.. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ కీ రోల్ పోషించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు కేసీఆర్. రాష్ట్రంలో ఎంపీ స్థానాలను పెంచుకోవడంపై ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు.

ప్రస్తుతం.. అధికార టీఆర్ఎస్ తరఫున 9 మంది ఎంపీలున్నారు. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి నలుగురు విజయం సాధించారు. సారు.. కారు.. 16 అని గత ఎన్నికల్లో.. టీఆర్ఎస్ రైజ్ చేసిన స్లోగన్.. అంతగా జనాల్లోకి వెళ్లలేదు. కానీ.. ఈసారి అలా కాకుండా.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించాలనే ఉద్దేశంతోనే.. కొందరు నాయకులకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారని.. గులాబీ నేతల్లో చర్చ జరుగుతోంది. 33 మంది జిల్లా అధ్యక్షుల్లో.. కనీసం నలుగురైదుగురిని.. పార్లమెంట్ ఎన్నికల బరిలో దింపే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా.. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ సీట్లపై.. టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. వీటితో పాటు కాంగ్రెస్ ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్న నల్గొండ, భువనగిరి, మల్కాజిగిరి స్థానాలను కూడా టార్గెట్ చేస్తోంది. అలాగే.. పార్టీలో కొత్తవారికి చాన్స్ ఇవ్వాలన్న ఆలోచనతో.. జిల్లా అధ్యక్షుల్లో కొందరిని ఎంపీలుగా పోటీ చేయించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. నాగర్ కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజును బరిలో దించే చాన్స్ ఉందని.. ప్రచారం జరుగుతోంది. నల్గొండ జనరల్ సీటు అయినప్పటికీ.. ఎస్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండటంతో.. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ను.. పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్.

ఇక.. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ కవిత.. ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోతే.. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జీవన్ రెడ్డిని.. అక్కడ దింపుతారనే టాక్ వినిపిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జడ్చర్ల ఎమ్మెల్యే.. లక్ష్మారెడ్డిని.. లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డిని.. భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని.. ఎంపీ అభ్యర్థిగా ప్రమోట్ చేసే చాన్స్ ఉందని.. పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక.. ఇదే టైంలో.. సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న కొందరు నేతలకు.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.