CM KCR : 8 నెలల తరువాత రాజ్ భవన్ కు వచ్చిన సీఎం కేసీఆర్

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయన్ ఈరోజు ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో జస్టిస్ ఉజ్జల్ భూయన్ చేత గవర్నర్‌ తమిళి సై ప్రమాణస్వీకారం చేయిస్తారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా? అని పలు అనుమానాలు హల్ చల్ చేస్తున్న క్రమంలో సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు చేరుకున్నారు.

CM KCR  : 8 నెలల తరువాత రాజ్ భవన్ కు వచ్చిన సీఎం కేసీఆర్

Cm Kcr Raj Bhavan Reached

KCR VS TAMILSAI: తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయన్ ఈరోజు ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో జస్టిస్ ఉజ్జల్ భూయన్ చేత గవర్నర్‌ తమిళి సై ప్రమాణస్వీకారం చేయిస్తారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా? అని పలు అనుమానాలు హల్ చల్ చేస్తున్న క్రమంలో సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు చేరుకున్నారు. గత కొంతకాలంలో రాజ్ భవన్ కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య కొంత వివాదం కొనసాగతున్న క్రమంలో రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయన్ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వస్తారో లేదో అనే ఊహాగాలు వస్తున్న వేళ వీటికి చెక్ పెడుతు సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు చేరుకున్నారు. దాదాపు 8 నెలల తరువాత సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వచ్చారు.

Also read : Justice Ujjal Bhuyan : నేడు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భూయన్ ప్రమాణస్వీకారం

మరికాసేపట్లో తెలంగాణ హైకోర్టు నూతన చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఉజ్జల్ భూయన్ తో గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకావటంతో ఇక రాజ్ భవన్ కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య వివాదానికి తెరపడుతుందని అందరు భావిస్తున్నారు.కాగా.. రాజ్ భవన్ లో జరిగే అధికారిక కార్యక్రమాలకు ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు తప్పనిసరిగా హాజరవుతుంటారు. కాని ఇప్పటి వరకు తెలంగాణలో ప్రస్తుతం సీన్ మరోలా ఉంది.తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య తీవ్ర స్థాయిలో కొనసాగుతునే ఉన్నాయి. గవర్నర్ ను కేసీఆర్ సర్కార్ వరుసగా అవమానిస్తున్నారని గవర్నర్ స్వయంగా పలు సందర్భాల్లో పలుమార్లు తెలిపిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఆమె ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

కాగా..తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లక చాలా రోజులైంది. గవర్నర్ తమిళి సైతో ఇటీవల కాలంలో ఎక్కడా ఆయన వేదిక పంచుకోలేదు. గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాలకు కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తే సీఎం కేసీఆర్ ఆయనకు స్వాగతం చెప్పలేదు. ప్రధాని పర్యటనలో గవర్నర్ తమిళి సై ఉంటారు కాబట్టే కేసీఆర్ డుమ్మా కొట్టారనే వార్తలు వచ్చాయి. అంతలా ఇద్దరి మధ్య విభేదాలు పెరిగిపోయినట్లుగా కనిపించాయి.గతంలో నరసింహన్ గవర్నర్ గా ఉన్న సమయంలో తరుచూ రాజ్ భవన్ వెళ్లేవారు కేసీఆర్. పండుగులు, ఇతర ముఖ్యమైన రోజుల్లో వెళ్లి గవర్నర్ కు విషెష్ చెప్పేవారు. కాని కొన్ని నెలలుగా రాజ్ భవన్ ముఖమే చూడటం లేదు కేసీఆర్. గవర్నర్ ఇచ్చే తేనేటి విందులకు కూడా వెళ్లడం లేదు. హైకోర్టు నూతన చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఉజ్జల్ భూయన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు  మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు, మేయర్, అధికారులు హాజరయ్యారు.