CM KCR : సీఎం కేసీఆర్ ఇవాళ్టి మహారాష్ట్ర పర్యటన రద్దు!

CM KCR : సీఎం కేసీఆర్ శుక్ర‌వారం (మే 27)న రాలేగావ్ సిద్ది (మహారాష్ట్ర) ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌యిన‌ట్లు తెలుస్తోంది. రాలేగావ్ సిద్ది, షిరిడీలో కేసీఆర్ పర్యటిస్తారని వెళ్తారని గతంలోనే సీఈఓ కార్యాలయం వెల్లడించింది.

CM KCR : సీఎం కేసీఆర్ ఇవాళ్టి మహారాష్ట్ర పర్యటన రద్దు!

Cm Kcr Ralegan Siddhi Tour Cancelled For Sometime

CM KCR : సీఎం కేసీఆర్ శుక్ర‌వారం (మే 27)న రాలేగావ్ సిద్ది (మహారాష్ట్ర) ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌యిన‌ట్లు తెలుస్తోంది. రాలేగావ్ సిద్ది, షిరిడీలో కేసీఆర్ పర్యటిస్తారని వెళ్తారని గతంలోనే సీఈఓ కార్యాలయం వెల్లడించింది. సీఎంవో ప్రకారం.. మే 26న బెంగళూరు, 27న రాలేగావ్‌ సిద్దిలో కేసీఆర్ పర్యటించాల్సి ఉంది. రాలేగావ్‌ సిద్దిలో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో కేసీఆర్ భేటీ కావాల్సి ఉంది. షిర్డీ వెళ్లి సాయిబాబాను కేసీఆర్ దర్శించుకుని హైదరాబాద్‌కు చేరుకుంటారని సీఎంవో గతంలోనే వెల్లడించింది.

అయితే మే 26న బెంగళూరు వెళ్లిన సీఎం కేసీఆర్ తిరిగి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఇతర షెడ్యూల్స్ కారణంగా సీఎం రాలేగవ్ సిద్ది, షిరిడీ పర్యటన వాయిదా పడినట్టు తెలుస్తోంది. మే 27న చేపట్టాల్సిన రాలేగావ్‌ సిద్ది పర్యటనపై అధికారిక సమాచారం లేదు. మరోసారి వెళ్లే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటనకు వెళ్లి వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశమయ్యారు. దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని, కచ్చితమైన మార్పు ఉంటుందని, అది ఎవరూ ఆపలేరని సీఎం కేసీఆర్‌ అన్నారు. వచ్చి కొన్ని నెలల్లో ఒక సంచలన వార్తను చెబుతానని సీఎం కేసీఆర్‌ అన్నారు.

దేవేగౌడ, కుమారస్వామితో దేశ, కర్ణాటక రాజకీయాలపై చర్చించినట్టు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని, ఎంతమందో ప్రధానులు వచ్చారని, కానీ దేశ పరిస్థితులు మాత్రం ఎంతమాత్రం బాగుపడలేదని కేసీఆర్ అన్నారు. వెనుకబడిన చైనా 16 మిలియన్ల ఎకానమీగా ఎదిగిందని, మనం మాత్రం 5 ట్రిలియన్ డాలర్ల వద్దే ఉన్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

Read Also : CM KCR: నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్‌.. ఎవ‌రెవ‌రితో భేటీ అవుతారంటే..