Budda Vanam : తెలంగాణ బుద్ధుని మార్గంలో పయనిస్తోంది : సీఎ కేసీఆర్

గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన బోధనలకు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రపంచానికి బుద్ధుడు నేర్పించిన శాంతి, సహనం, అహింస అనుసరించాల్సిన ధర్మాలని అన్నారు. బౌద్ధానికి తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఉందని..గోదావరి పరివాహక ప్రాంతాల్లో బౌద్ధం పరిఢవిల్లింది అని అన్నారు.

Budda Vanam : తెలంగాణ బుద్ధుని మార్గంలో పయనిస్తోంది : సీఎ కేసీఆర్

Buddavanam

BUDDAVANAM : గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన బోధనలకు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రపంచానికి బుద్ధుడు నేర్పించిన శాంతి, సహనం, అహింస అనుసరించాల్సిన ధర్మాలని అన్నారు. బౌద్ధానికి తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఉందని..గోదావరి పరివాహక ప్రాంతాల్లో బౌద్ధం పరిఢవిల్లింది అని అన్నారు. కృష్ణానది ఒడ్డున ప్రకృతి రమణీయతల నడుమ అన్ని హంగులతో నాగార్జున సాగర్ లో అంతర్జాతీయ స్థఆయిలో బౌద్ధ కేంద్రాన్ని నిర్మించాం అని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న బుద్ధ వనం కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించి జాతికి అంకితం చేసింది అని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. బుద్ధుని మార్గంలో తెలంగాణ పయనిస్తోంది అని అన్నారు.

బుద్ధుని జీవిత చరిత్ర, బోధనలు, తదితర సమస్త సమాచారంతో కూడిన బుద్ధవనం ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భాసిల్లుతుందని అని సీఎం కేసీఆర్ అన్నారు. సర్వజన సంక్షేమం, ప్రేమ, శాంతి, సహజీవనాలతో కూడిన ప్రగతి దివగా గౌతమ బుద్ధుని మార్గంలో తెలంగాణ పయనిస్తోంది అని అన్నారు. కాగా..నాగార్జున సాగర్ లో నిర్మించిన అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రం గత వారం నుంచి అందుబాటులోకి వచ్చింది. 247 ఎకరాల్లో అత్యద్భుత్ంగా రూపు దిద్దుదకున్న ఈ బౌద్ధక్షేత్రాన్ని మంత్రి కేటీఆర్ బుద్ధవనాన్ని ప్రారంభించారు.

బౌద్ధులకు పవిత్ర భూమి.. తథాగతుడి జీవితచరిత్రకు నిలువుటద్దం.. బుద్ధం శరణం గచ్చామి అంటూ మార్మోగిన ప్రదేశం.. బౌద్ధం దేదీప్యమానంగా విరాజిల్లిన ప్రాంతం.. కృష్ణమ్మ ఒడిలో సుందరంగా ఒదిగిన బోధిసత్వుడి చరితం ఈ ప్రదేశం.. అదే తెలంగాణ నేలలో మరో పర్యాటక కేంద్రంగా వెలసిన ప్రదేశం బుద్ధవనం. గౌతమబుద్ధుడు.. సమస్యలన్నింటికి కోరికలే కారణమని చెప్పిన మహాత్ముడు. ఈ పేరు వినగానే మన కళ్ల ముందు మెదిలే రూపం.. కళ్లు మూసుకుని ధ్యానం చేస్తున్న ఓ నిర్మల రూపం. బుద్ధుడి బోధనలు మానవులకు ధర్మమార్గంలో ఎలా నడవాలో చూపాయి. అందుకే.. ఆయన పుట్టుక నుంచి తుదిశ్వాస వరకు పూర్తి చరిత్రను, ఆధునిక టెక్నాలజీతో, అత్యద్భుతంగా.. వేల ఏండ్ల నాటి చరిత్రను మరో వెయ్యేళ్ల వరకు.. కొన్ని తరాల వరకు బౌద్ధం ఆనవాళ్లను ప్రపంచానికి చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. బౌద్ధం పురుడు పోసుకున్న నేల నాగార్జునకొండను బుద్ధవనంగా మార్చి ప్రపంచం ముందు నిలిపింది