నేనే సీఎంగా కొనసాగుతా..

నేనే సీఎంగా కొనసాగుతా..

CM KCR responded to the change of CM : తెలంగాణలో గత కొంతకాలంగా సీఎం మార్పుపై ప్రచారం సాగుతోంది. మంత్రి కేటీఆర్ ను సీఎం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఆ ప్రచారాలన్నింటికీ సీఎం కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. సీఎం మార్పు వార్తలపై సీఎం కేసీఆర్ స్పందించారు. ‘నేనే సీఎంగా కొనసాగుతాను’ అని స్పష్టం చేశారు.

సీఎం మార్పుపై మాట్లాడొద్దని నేతలకు కేసీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం మార్పుపై మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. సీఎం మార్పు గురించి ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దన్నారు.

వివాదాలకు వెళ్లకండని ఎమ్మెల్యేలకు సూచించారు. నేతలు ఈ వ్యవహారంపై సైలెంట్ గా ఉండాలన్నారు. 10 ఏళ్లపాటు తానే సీఎంగా ఉంటానని అసెంబ్లీలోనే స్పష్టం చేసినట్లు కేసీఆర్ గుర్తు చేశారు.

ఈ నెల 9 లేదా 10న హైదరాబాద్ మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తానని చెప్పారు. సీల్డ్ కవర్ లో నూతన మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లు పంపిస్తానని తెలిపారు. ఈ నెల 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగనుందని పేర్కొన్నారు.