ఆ తల్లులకు పాదపూజ చేస్తా : సీఎం కేసీఆర్

లాక్ డౌన్ సమయంలో ప్రజలు పరస్పర సహకారంతో ముందుకు నడవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

  • Published By: veegamteam ,Published On : April 6, 2020 / 06:30 PM IST
ఆ తల్లులకు పాదపూజ చేస్తా : సీఎం కేసీఆర్

లాక్ డౌన్ సమయంలో ప్రజలు పరస్పర సహకారంతో ముందుకు నడవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

లాక్ డౌన్ సమయంలో ప్రజలు పరస్పర సహకారంతో ముందుకు నడవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమలుపై సోమవారం (ఏప్రిల్ 6, 2020) హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ తల్లి బీడీలు చుట్టి తాను పొదుపు చేసుకున్న డబ్బులో 20 వేల రూపాయలు తీసుకొచ్చి సాయం చేసిందన్నారు. మేడ్చల్ లో మరో మహిళ తనకు వచ్చిన బియ్యంలో 22 కిలోలు ఇతరులకు సాయం చేసిందని తెలిపారు. ఆ తల్లులకు రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నట్లు తెలిపారు. అవకాశం వస్తే వారికి పాద పూజ చేస్తానని చెప్పారు. అందరం చల్లగా బతికితే రాష్ట్ర అవతరణ దినోత్సం సందర్భంగా ఆ తల్లులకు అవార్డు కూడా ఇస్తామని తెలిపారు. 

కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు పంచుకునే వారు కావాలన్నారు. కానీ చిల్లరమళ్లగాళ్లు, అల్పమనస్కులు అవసరం లేదని తేల్చి చెప్పారు. చిల్లర రాజకీయాలు, ప్రచారాలు చేసేవాళ్లు అవసరం లేదని చెప్పారు. దేశానికి కావాల్సింది దుర్మార్గులు కాదని, పాజిటివ్ గా సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్లు కావాలని కోరారు. ఇలాంటి సందర్భంలోనే అల్పులు, గొప్పవాళ్లు బయటపడతారని చెప్పారు. ఎవరు చీప్ గా ఆలోచిస్తారో, ఎవరు గొప్పగా ఆలోచిస్తారో తెలుస్తుందన్నారు.  

ఈ సమయంలో ముందుకు తీసుకుపోకే వైతాళికులు కావాలన్నారు. మనో నిబ్బరాన్ని కల్గించే వారు కావాలన్నారు. గొప్ప వ్యక్తులు కావాలని కోరారు. కవులు, గాయకులు సమాజానికి మానిసిక స్థైర్యం కల్పించాలన్నారు. ఇలాంటి సమయాల్లో రాజకీయాలు చేయొద్దని సూచించారు. 

పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ ను మరో రెండు వారాలు కొనసాగించాలని ప్రధాని మోడీని కోరినట్లు తెలిపారు. అన్ని శక్తియుక్తులన్న అమెరికా లాంటి దేశమే శవాల గుట్టగా మారిపోయిననప్పుడు… మనలాంటి దేశానికి లాక్‌డౌనే కరోనా కట్టడికి పరిష్కారమని అన్నారు. 

Also Read | కరోనా బాధితులను ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ చేర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు