CM KCR : పల్లె, పట్టణ ప్రగతి కోసం జిల్లాకు కోటి, 32 జిల్లాలకు రూ. 32 కోట్లు

తెలంగాణ‌లో జులై 1వ తేదీ నుంచి చేప‌ట్టనున్న ప‌ల్లె ప్రగ‌తి, ప‌ట్టణ ప్రగ‌తి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు నిధులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కో జిల్లాకు కోటి రూపాయల చొప్పున, హైద‌రాబాద్ మిన‌హా 32 జిల్లాల‌కు 32 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

CM KCR : పల్లె, పట్టణ ప్రగతి కోసం జిల్లాకు కోటి, 32 జిల్లాలకు రూ. 32 కోట్లు

Kcr

Palle Pragathi : తెలంగాణ‌లో జూలై 1వ తేదీ నుంచి చేప‌ట్టనున్న ప‌ల్లె ప్రగ‌తి, ప‌ట్టణ ప్రగ‌తి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు నిధులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కో జిల్లాకు కోటి రూపాయల చొప్పున, హైద‌రాబాద్ మిన‌హా 32 జిల్లాల‌కు 32 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. తెలంగాణ వ్యాప్తంగా జూలై 1 నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, హరితహారంపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

అమలు చేయనున్న కార్యక్రమాలపై చర్చించారు. జూలై 01వ తేదీ నుంచి వీటిని ప్రారంభించాలని, ఏ పని పెండింగ్ లో ఉండొద్దని స్పష్టంగా ఆదేశించారు సీఎం కేసీఆర్. నిర్దేశించిన ఏ ప‌నీ పెండింగ్‌లోఉండేందుకు వీల్లేద‌న్నారు. పంచాయ‌తీరాజ్ శాఖ‌కు ప్రభుత్వం బాగా స‌హ‌క‌రిస్తోందని…. ప‌నులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో స‌మీక్ష చేసుకోవాల‌ని ఆదేశించారు.

గ్రామాల్లో ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇచ్చి నాటించాలని, గ్రామాల్లో విద్యుత్ స‌మ‌స్య ప‌రిష్కారానికి ప‌వ‌ర్ డే పాటించాలని… ప్రజ‌ల‌ను చైత‌న్యప‌రిచి శ్రమ‌దానంలో పాల్గొనేలా చేయాల‌ని సూచించారు సీఎం కేసీఆర్. పోడుభూముల సమస్య పరిష్కారానికి సమగ్ర నివేదిక తయారు చేయాలన్నారు.